గాజియాబాద్‌లో ఓ వరుడు చేసిన పని సర్వత్రా విమర్శలకు దారితీసింది. పెళ్లి కూతురును సంతోషపెట్టడానికి పెళ్లిలోనే గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ వీడియో సామాజికా మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
జిల్లాలో ఇందిరాపురంలోని ఓ ఫామ్ హౌజ్‌లో ఓ జంట వివాహం చేసుకుంది. పెళ్లి తంతు ముగియగానే ఊరేగింపు కోసం బయటికి వచ్చారు. నూతన వధూవరులిద్దరు కారులో కూర్చోడానికి సిద్ధమయ్యారు. బంధువులంతా పక్కనే ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు పిస్టల్ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. వధువు బయపడుతూనే ఆనందాన్ని వ్యక్తపరిచింది. పిస్టల్ దిశను పైకి ఉంచమని కోరింది. వధువును సంతోషపెట్టడానికి వరుడు ఈ మేరకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అయింది. కాల్పులు జరిపి చట్టాన్ని ఉల్లంఘించినందుకు శిక్షించాలనే డిమాండ్లు వచ్చాయి.
దీనిపై స్పందించిన పోలీసులు.. వీడియోను పరిశీలిస్తున్నామని తెలిపారు. త్వరలో కేసు నమోదు చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:'బార్డర్' బాబుకు వీసా మంజూరు.. స్వదేశానికి ఎప్పుడంటే?