కొవిడ్ వేళ గతేడాది భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్యసేతు యాప్.. కరోనా వైరస్‌పై ప్రజలను ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని ఇచ్చేది. అలాగే వైరస్ సమాచారంతో పాటు టీకా రిజిస్ట్రేషన్ వివరాలను దానిలో పొందుపరిచింది. తాజాగా ఆ యాప్‌లో మరో అప్‌డేట్ వచ్చింది. దానిలో భాగంగా ఇకనుంచి టీకా తీసుకున్న వారి స్టేటస్ కనిపిస్తుంది. ఒక టీకా డోసు తీసుకున్న వ్యక్తి పేరు పక్కన ఒక బ్లూ మార్క్, రెండు డోసులు పూర్తయితే రెండు బ్లూ టిక్ మార్కులు కనిపిస్తాయి. రెండు బ్లూ టిక్ మార్కులు కనిపిస్తే.. వ్యాక్సినేషన్ పూర్తయినట్లని ఆరోగ్య సేతు ట్విట్టర్‌లో వెల్లడించింది. 'ఆరోగ్యసేతులో టీకా స్టేటస్‌ను అప్‌డేట్‌చేసుకోవచ్చు. టీకాలు వేయించుకొని, రెండు బ్లూ టిక్ మార్కులు పొందండి. బ్లూ షీల్డ్‌ను పొందండి' అని ట్వీట్ చేసింది.
2020 ఏప్రిల్‌లో ఆరోగ్యసేతు యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం దాని నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ చూస్తోంది. ప్రజల్ని కరోనా నుంచి సురక్షితంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు ఆ యాప్‌లో తగిన సమాచారం అందుబాటులో ఉంచేది. కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చాక.. కొవిన్ పోర్టల్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్‌లో కూడా కరోనా టీకా బుకింగ్‌కు వీలుకల్పించింది.
ఇదీ చూడండి: చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు ఉంటుంది?