ETV Bharat / bharat

Generic Medicine NMC Guidelines : 'ఆ మందులు రాయకుంటే డాక్టర్ల లైసెన్స్​ రద్దు'.. NMC కీలక ఆదేశాలు - ఎన్​ఎమ్​సీ కొత్త నిబంధనలు

Generic Medicine NMC Guidelines : దేశంలో జనరిక్​ ఔషధాల వినియోగాన్ని పెంచేందుకు నేషనల్‌ మెడికల్ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రోగులకు జనరిక్‌ ఔషధాలనే సూచించాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలతో పాటు లైసెన్స్ కూడా​ రద్దు చేస్తామని ఎన్​ఎమ్​సీ హెచ్చరించింది.

generic-medicine-nmc-guidelines-doctors-should-prescribing-generic-drugs-only-says-new-nmc-regulation
జనరిక్ మెడిసిన్ ఎన్​ఎమ్​సీ మార్గదర్శకాలు
author img

By

Published : Aug 13, 2023, 7:47 AM IST

Updated : Aug 13, 2023, 9:11 AM IST

Generic Medicine NMC Guidelines : చికిత్సలో భాగంగా రోగులకు కేవలం జనరిక్‌ ఔషధాలనే సూచించాలని నేషనల్‌ మెడికల్ కమిషన్‌ స్పష్టం చేసింది. అలా చేయని పక్షంలో సంబంధిత వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే కొంతకాలం పాటు ప్రాక్టీస్‌ చేయకుండా లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు రిజిస్టర్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్ల వృత్తిపరమైన ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలను ఎన్​ఎమ్​సీ జారీ చేసింది.

Nmc Generic Medicine 2023 : బ్రాండెడ్‌ జనరిక్‌ ఔషధాలను సైతం సూచించడం మానుకోవాలని కూడా వైద్యులకు సూచించింది ఎన్​ఎమ్​సీ. వైద్యులు జనరిక్‌ ఔషధాలు రాయాలనే నిబంధన ఉన్నప్పటికీ.. ఉల్లంఘిస్తే తీసుకోవాల్సిన చర్యలను 2002లో భారతీయ వైద్య మండలి-ఐఎమ్​సీ జారీచేసిన నియమావళిలో ప్రస్తావించలేదు. బ్రాండెడ్‌ ఔషధాలతో పోల్చితే.. జనరిక్ ఔషధాలు 30 శాతం నుంచి 80 శాతం వరకు చౌకగా లభిస్తాయని.. వీటిని సూచిస్తే ఆరోగ్య సంరక్షణ భారాన్ని తగ్గిస్తాయని ఈనెల 2న ఎన్​ఎమ్​సీ నోటిఫై చేసిన నిబంధనల్లో పేర్కొంది. దాంతో పాటు నాణ్యమైన సంరక్షణను పొందేందుకు వీలు కలుగుతుందని తెలిపింది.

భారత పౌరుల్లో చాలా మంది తమ ఆదాయంలో ఎక్కువ భాగం ఔషధాలకే వెచ్చిస్తున్నారని ఎన్​ఎమ్​సీ అభిప్రాయపడింది. మందుల చీటీలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడాలని వైద్యులకు తెలిపింది ఎన్​ఎమ్​సీ. వీలైనంత వరకు ప్రిస్క్రిప్షన్​లను టైపింగ్​ లేదంటే ప్రింట్​ రూపంలో ఇవ్వాలని పేర్కొంది. ప్రతీ ఆర్​ఎమ్​పీ డాక్టర్​ అవసరమైన మందులనే రోగులను సూచించాలని తెలిపింది. దాంతో పాటు మార్కెట్​ అందుబాటులో ఉన్న జనరిక్​ మందులనే వారిని సూచించాలని వివరించింది. మెడికల్​ షాప్​, ఆస్పత్రులలో అవసరమైన జనరిక్​ ఔషదాలు స్టాక్​ ఉండేలా వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్​ఎమ్​సీ పేర్కొంది.

తాజా నిబంధనలు ఉల్లఘించిన వైద్యులకు తొలుత హెచ్చరికలు జారీచేస్తామని.. అవసరమైతే వర్క్‌ షాపులకు హాజరవ్వాల్సిందిగా కోరతామని ఎన్​ఎమ్​సీ ప్రకటించింది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడిన వైద్యుల లైసెన్స్‌.. కొంతకాలం సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించింది. జన్ ఔషధి కేంద్రాలలో, జనరిక్​ ఫార్మసీ షాప్​లలో మందులు కొనేలా రోగులను పోత్సహించాలని వైద్యులకు ఎన్​ఎమ్​సీ సూచించింది. బ్రాండెడ్​ మందులతో సరిసమానంగా జనరిక్​ ఔషదాలు పనిచేస్తాయనే విషయాన్ని.. వైద్య విద్యార్థుల్లో, సాధారణ ప్రజల్లో తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించాలని ఎన్​ఎమ్​సీ తెలిపింది.

ఈ జబ్బులకు మందుల చీటీ అవసరం లేదు..
చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు వైద్యుడి చీటీ లేకున్నా మందుల దుకాణానికి వెళ్లి ఔషధాలు తీసుకునే వెసులుబాటును ఎన్‌ఎంసీ తొలిసారిగా కల్పించింది. ఇందుకు సంబంధించి తాజా నిబంధనల్లో కొన్ని రకాల చికిత్సలకు జాబితాను రూపొందించింది. అవి..

  • మొలలు తగ్గించే ఔషధాలు
  • టాపికల్‌ యాంటిబయాటిక్స్‌
  • దగ్గు తగ్గించే మందులు (కాఫ్‌ సప్రెసెంట్స్‌)
  • నొప్పి తగ్గించే మందులు
  • తలనొప్పి తగ్గించే ఔషధాలు
  • ముక్కుదిబ్బడ తగ్గించేవి
  • ఆస్ప్రిన్‌
  • రక్తనాళాలను విప్పార్చేవి
  • ఛాతీలో మంట తగ్గించే ఔషధాలు
  • దగ్గు మందులు (ఎక్స్‌పెక్టోరెంట్స్‌)
  • ఫంగస్‌ను తగ్గించేవి
  • అలర్జీని తగ్గించేవి
  • యాస్‌ తగ్గించేవి
  • పొగతాగే అలవాటును మాన్పించే మందులు

సాధారణ జబ్బులకు పై కేటగిరీ ఔషధాలను ఎలాంటి వైద్య నిపుణుడి వద్ద చికిత్స తీసుకోకుండా, నేరుగా మందుల దుకాణంలో కొనుక్కొవచ్చని ఎన్‌ఎంసీ తెలిపింది. షెడ్యూల్‌ 'హెచ్‌' ఔషధాలకు మాత్రం వైద్యుడి తప్పనిసరని చీటీ అవసరమని స్పష్టం చేసింది.

Generic Medicine: 'మందుల చీటీలో బ్రాండ్ల పేర్లతో ఔషదాలు రాయొద్దు.. రాశారంటే'

Pratidwani: జనరిక్‌ మందుల నాణ్యతల్లో వాస్తవాలేంటి ?.. ప్రజలకు చేరువ చేయడం ఎలా ?

Last Updated : Aug 13, 2023, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.