ETV Bharat / bharat

అతడు 'యాసిడ్ దాడి' చేస్తాడన్న భయంతో యువతి ఆత్మహత్య​ - delhi suicide news

ఇష్టం లేకపోయినా, హింసిస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని ఆ యువతి పెళ్లిచేసుకుంది. పెళ్లి తర్వాత కూడా అతడి ప్రవర్తన మారకపోవడం వల్ల విడాకులు తీసుకుంది. అయినా అతడు ఆమెను విడిచిపెట్టలేదు. ముఖంపై యాసిడ్​ పోస్తానని బెదిరించాడు(acid attack). అది నిజమవుతుందని భయపడి ఆ యువతి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గాజిపుర్​లో జరిగింది(ghazipur suicide news).

ghazipur crime news
యువతి ఆత్మహత్య​
author img

By

Published : Nov 18, 2021, 4:00 PM IST

తూర్పు దిల్లీలోని గాజిపుర్​లో పింకీ అనే యువతిని చేతన్​ నిత్యం హింసచేవాడు(ghazipur crime news). తనని పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. హింసను తట్టుకోలేక పింకీ అతడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా చేతన్​ ప్రవర్తనలో మార్పు రాలేదు. పింకీని చిత్రహింసలు పెట్టాడు. ఇక చేతన్​ నుంచి విముక్తి పొందాలని నిర్ణయించుకున్న పింకీ.. అతడి నుంచి విడాకులు తీసుకుంది.

విడాకులు వచ్చినప్పటికీ పింకీని చేతన్​ విడిచిపెట్టలేదు. ఆమెను వెంబడించేవాడు. ఈ క్రమంలోనే పింకీకి రెండో పెళ్లి జరుగుతున్నట్టు, ఆమె కుటుంబసభ్యులు సంబంధాలు వెతుకుతున్నట్టు చేతన్​ తెలుసుకున్నాడు. కోపంతో.. మరో వ్యక్తితో కలిసి ఆదివారం నాడు పింకీ ఇంటికెళ్లాడు. చేతన్​ తన వెంట యాసిడ్​ బాటిల్(acid attack)​ తీసుకెళ్లి, ఎవరినైనా పెళ్లిచేసుకుంటే ముఖంపై యాసిడ్​ పోస్తానని బెదిరించాడు. అదే నిజమవుతుందని భయపడి.. ఆ రోజు రాత్రి ఆమె తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషయాన్ని పింకీ తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖను గుర్తించారు. చేతన్​ తనను చిత్రహింసలు పెడుతున్నాడని, తనకు ఇష్టం లేకపోయినా బలవంతం మీద పెళ్లి చేసుకున్నానని ఆ లేఖలో పింకీ రాసింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా చేతన్​ తనను విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై యాసిడ్​ పోస్తానని బెదిరించడం వల్ల.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపింది(ghazipur suicide news).

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పింకీ రాసిన లేఖను ఫోరెన్సిక్​ పరీక్షల కోసం పంపించారు.

ఇదీ చూడండి:- అనుమానమే పెనుభూతం- భార్యపై యాసిడ్​ దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.