బిహార్ గయా పంచాయతీ ఎన్నికల్లో (Gaya panchayat election 2021) ఆసక్తికర పోటీ నెలకొంది. ఝాక్తియాలోని ముఖియా పంచాయతీలో సొంత అన్నదమ్ములు.. ఒకే పదవికి పోటీ (Bihar Gaya news) పడుతున్నారు.
ఖాలిక్ ఉర్ రెహ్మాన్ ఖాన్.. ముఖియా పంచాయతీకి (Gaya panchayat election 2021) పదేళ్లు అధ్యక్షుడిగా పనిచేశారు. 2016లో ఈ స్థానాన్ని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించారు. దీంతో ఆ ఏడాది ఈశ్వర్ మాంఝీ అనే వ్యక్తిని నిలబెట్టి గెలిపించారు ఖాలిక్. మాంఝీ పదవీకాలం ముగుస్తుండటం వల్ల.. ఈ సారి ఐశ్వర్య మాంఝీ అనే వ్యక్తిని పోటీలో నిలబెట్టారు.
అయితే, ఖాలిక్ తమ్ముడు తంజీల్ ఉర్ రెహ్మాన్ ఖాన్.. తన అన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సామాజిక కార్యకర్త అయిన తంజీల్.. గత 15 ఏళ్లుగా పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని ఆరోపిస్తున్నారు. అవినీతి, వివక్ష కారణంగా ఇక్కడి ప్రజలు అభివృద్ధిలో వెనకబడి ఉన్నారని అంటున్నారు. దీంతో ఐశ్వర్య మాంఝీ కజిన్‌ను పోటీలో నిలబెట్టారు తంజీల్.
ఈ పంచాయతీ ఎన్నికల (Gaya panchayat election 2021) వ్యవహారం స్థానికంగా (Bihar Gaya news) చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు సొంత సోదరులు పరోక్షంగా పోటీ పడుతుండటం వల్ల ఆసక్తి నెలకొంది. సోదరులిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఎన్నికల్లో (Gaya panchayat election 2021) మాత్రం ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోటీ పడుతున్నారు.
ఇదీ చదవండి: పదో తరగతి తెలివితేటలతో 'డ్రగ్స్' ల్యాబ్.. చివరకు?