Gautam Gambhir News Latest: మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌కు వారం రోజుల వ్యవధిలో మూడోసారి పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. శనివారం వచ్చిన ఈ మెయిల్లో 'దిల్లీ సెంట్రల్ పోలీస్ కమిషనర్ స్వేతా చౌహాన్ కూడా నిన్ను రక్షించలేరని, కశ్మీర్‌పై రాజకీయాలు చేయోద్దని' ఉందని గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరుసగా మూడోసారి..
నవంబరు 23న గంభీర్‌కు మొదటిసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీనిపై దిల్లీ పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేశారు గంభీర్. ఐఎస్‌ఐఎస్ కశ్మీర్ అనే ఉగ్రవాద సంస్థ((isis kashmir) తనను చంపుతానని బెదిరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరుసటిరోజే మరో మెయిల్ వచ్చింది. అందులో 6 సెకన్ల నిడివితో గంభీర్ ఇంటిని వీడియో తీసి పంపించారు. 'నవంబరు 23నే గంభీర్ చంపాలనుకున్నానని, కానీ బతికిపోయాడు' అని ఉంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గంభీర్ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.
ఈ మెయిల్స్ పాకిస్థాన్, కరాచీ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామన్నారు.
కారణం అదేనా..?
ఇటీవల.. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను 'పెద్దన్న' అని సంబోధించడాన్ని గంభీర్ తీవ్రంగా తప్పుపట్టారు. అంతేగాక.. పాక్‌ను తీవ్రవాద దేశంగా అభివర్ణించారు.
ఇదీ చూడండి: గంభీర్‌కు బెదిరింపులు- చంపేస్తామంటూ 'ఐఎస్‌ఐఎస్ కశ్మీర్' లేఖ