Gas Stove Cleaning Tips in Telugu : ఇంట్లో సమయానికి వంట పూర్తికాకపోతే.. గృహిణులు హైరానా పడిపోతారు. పిల్లల స్కూలు, భర్త ఆఫీసు అన్నీ.. వంటతోనే ముడిపడి ఉంటాయి మరి. అయితే.. కొందరి వంటింట్లో గ్యాస్ స్టౌ నుంచి సరిగా మంట రాదు. కొత్తలో పూర్తిగా వెలిగిన గ్యాస్ బర్నర్.. ఆ తర్వాత తగ్గిపోతుంది. దీనికి కారణం.. వంట పదార్థాలు బర్నర్స్‌పై అంటుకోవడమే. పాలు, అన్నం, పప్పు వంటివి పొంగడం.. దోశ పిండి అంటుకోవడం.. ఇలా తరచూ బర్నర్స్‌పై పడడంతో.. వాటి రంద్రాలు మూసుకుపోతాయి. ఈ క్రమంలో దాన్ని ఎపట్టికప్పుడు శుభ్రం చేస్తే సరి.. లేదంటే జిడ్డు పేరుకుపోయి మంట సరిగా రాదు. అంతేకాకుండా.. చూడటానికి కూడా స్టౌ చాలా అసహ్యంగా కనిపిస్తుంది. మరి.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. మేము చెప్పే ఈ టిప్స్ పాటించండి.
ఎలా క్లీన్ చేసుకోవాలంటే..? (How to Clean Gas Stove with Easy Tips) :
- గ్యాస్ స్టవ్ క్లీనింగ్ ప్రక్రియ ప్రారంభించే ముందు.. సిలిండర్ దగ్గర రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి.
- దీనికోసం సబ్బును కాస్త నీటిలో కరిగించండి. ఓ స్క్రబ్బర్ తీసుకోండి.
- ముందుగా స్టౌ పై ఉండే బర్నర్స్, ప్లేట్స్ తీసేయండి. వాటిని సబ్బు నీటిలో నానబెట్టండి.
- ఆ తర్వాత స్టౌ మూలల్లో ఏదైనా చెత్త పేరుకుపోతే క్లీన్ చేయండి.
- బర్నర్స్ నీటిలో నానిన తర్వాత వాటిని స్క్రబ్బర్‌తో క్లీన్ చేయండి.
- బర్నర్ రంధ్రాల్లో పేరుకుపోయిన చెత్త బయటకు రాకపోతే.. బ్రష్‌తో క్లీన్ చేయండి.
- మంట సరిగా రాకపోవడానికి ఈ రంధ్రాలు మూసుకుపోవడమే కారణం.
మీ వంటగ్యాస్ త్వరగా అయిపోతోందా? - ఈ టిప్స్‌తో నెల వచ్చేది 2 నెలలు రావడం పక్కా!
గ్యాస్ బర్నర్స్ క్లీన్ కాకపోతే..?
- సబ్బు నీటితో గ్యాస్ బర్నర్స్ ఒక్కోసారి క్లీన్ కాకపోవచ్చు. జిడ్డు బాగా పేరుకుపోయి తుప్పు వదలకపోవచ్చు.
- ఇలాంటప్పుడు.. బర్నర్స్ను క్లీన్ చేయడంలో అమ్మోనియా బాగా పనిచేస్తుంది.
- అందుకోసం మార్కెట్ నుంచి అమ్మోనియా తీసుకొచ్చి.. దాన్ని ఓ పాత్రలో పోసి.. అందులో బర్నర్స్ వేసి ఒక రాత్రి అంతా ఉంచాలి.
- ఆ తర్వాత రోజు ఉదయమే వీటిని క్లీన్ చేస్తే.. బర్నర్స్ పూర్తిగా శుభ్రమై.. కొత్త వాటిలా కనిపిస్తాయి.
స్టవ్‌ను స్పాంజితో..
- బర్నర్స్ను బలంగా క్లీన్ చేసినప్పటికీ.. స్టవ్ క్లీనింగ్ విషయంలో మృదువుగా వ్యవహరించాలి.
- ఇందుకోసం సబ్బునీరు సరిపోతుంది. అయితే.. క్లీన్ చేయడానికి స్క్రబ్బర్ బదులు.. స్పాంజ్ వాడితే బెటర్
- స్క్రబ్బర్‌తో క్లీన్ చేస్తే.. స్టౌవ్ మీద గీతలు పడతాయి.
- దీనికి ముందు.. సబ్బు నీటిని స్టౌవ్ మీద చల్లి.. కాసేపు నానబెడితే సరిపోతుంది.
చివరగా.. స్టవ్ మీద పడిన మరకలను క్లీన్ చేసేందుకు ఎక్కువ రోజులు తీసుకోవద్దు. దీనివల్ల మరకలు మొండిగా తయారవుతాయి. దీనివల్ల స్టౌ తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల.. సాధ్యమైనంత త్వరగా క్లీన్ చేసుకుంటే మంచిది. మరకలు పడిన రోజే క్లీన్ చేస్తే చాలా మంచిది.
గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్పైరీ డేట్- ఎలా చెక్ చేయాలో తెలుసా?