ETV Bharat / bharat

ప్రపంచంలోనే డేంజరస్ స్కైవే- 59ఏళ్ల తర్వాత రీఓపెన్​ - ఉత్తరాఖండ్​ న్యూస్

ఉత్తరాఖండ్​లోని చారిత్రక గర్తాండ్​ స్కైవేను(Gartang Gali) 59ఏళ తర్వాత తిరిగి తెరిచింది ప్రభుత్వం. 11వేల అడుగుల ఎత్తులో కొండకు ఆనుకుని ఉండే ఈ మార్గాన్ని చూస్తే పర్యటకులు వినూత్న అనుభూతి పొందుతారు. ప్రస్తుతం కొవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే సందర్శకులను అనుమతిస్తున్నారు.

gartang-worlds-most-dangerous-street-located-in-uttarkashi-uttarakhand-opened-for-tourists
Gartang Gali: 150ఏళ్ల నాటి స్కైవే.. 59ఏళ్ల తర్వాత రీఓపెన్​
author img

By

Published : Aug 20, 2021, 5:04 PM IST

Updated : Aug 20, 2021, 6:44 PM IST

సాహస యాత్రికుల కోసం ఉత్తరాది రాష్ట్రం ఉత్తరాఖండ్‌ అద్భుతమైన అవకాశం అందిస్తోంది. 150ఏళ్ల నాటి చారిత్రక గర్తాంగ్‌ గాలీ(Gartang Gali) చెక్క మెట్ల మార్గాన్ని(స్కైవే)ను 59ఏళ్ల తర్వాత తిరిగి తెరిచింది. దాదాపు 11వేల అడుగుల ఎత్తులో కొండకు ఆనుకుని ఉండే ఈ స్కైవేను చూస్తేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

gartang-worlds-most-dangerous-street-located-in-uttarkashi-uttarakhand-opened-for-tourists
Gartang Gali: 150ఏళ్ల నాటి స్కైవే.. 59ఏళ్ల తర్వాత రీఓపెన్​

ఉత్తరకాశీ జిల్లాలోని నీలంగ్‌ లోయలో(Gartang Valley) ఉందీ గర్తాంగ్‌ గాలీ స్కైవే. పూర్తిగా చెక్కతో ఉండే ఈ మెట్ల మార్గాన్ని 150ఏళ్ల క్రితం పెషావర్‌(పాకిస్థాన్)కు చెందిన పఠాన్లు నిర్మించారు. ఈ మెట్ల మార్గం భూ ఉపరితలానికి 11వేల అడుగుల ఎత్తులో 150 మీటర్ల పొడవులో ఉంటుంది. స్వాతంత్ర్యానికి పూర్వం టిబెట్‌తో వ్యాపార కార్యాకలాపాల కోసం దీన్ని నిర్మించారు. ఉన్ని, లెదర్‌ వస్తువులు, ఉప్పు తదితర ఉత్పత్తులను ఈ మార్గం ద్వారా తరలించేవారు.

కాగా.. 1962లో జరిగిన భారత్‌ - చైనా యుద్ధం తర్వాత ఈ మెట్ల మార్గాన్ని భారత ప్రభుత్వం మూసివేసింది. పర్యాటకులను నిషేధించింది. అయితే 2015లో నీలంగ్‌ లోయను తిరిగి తెరిచినప్పుడు ఈ మెట్ల మార్గానికి కూడా మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.64లక్షలు ఖర్చు చేసి దీన్ని మరమ్మతు చేశారు. బుధవారం నుంచి ఇక్కడకు పర్యటకులను అనుమతిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలతో ఒకసారి 10 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతి కల్పిస్తున్నట్లు ఉత్తరకాశీ జిల్లా మెజిస్ట్రేట్‌ మయూర్‌ దీక్షిత్‌ తెలిపారు.

ఈ మెట్ల మార్గం నుంచి వెళ్తుంటే నీలంగ్‌ లోయ ఎంతో రమణీయంగా కన్పిస్తుంది. ఈ లోయ ఎన్నో ప్రకృతి అందాలకు, అరుదైన వణ్యప్రాణులకు నెలవు. మంచు చిరుతలు, నీలం వర్ణం గొర్రెలు ఇక్కడ ప్రత్యేకం. ట్రెక్కింగ్‌ చేసే వారికి ఇదో మంచి అనుభూతి..!

ఇదీ చూడండి: నలుగురు పిల్లల తల్లితో యువకుడి 'ప్రేమ వివాహం'

Last Updated : Aug 20, 2021, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.