ETV Bharat / bharat

17ఏళ్ల బాలికను బెదిరించి.. నెలలుగా 20 మంది అత్యాచారం!

Gangrape: 17 ఏళ్ల బాలికపై దాదాపు 20 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనుమానుష ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. బెదిరించి కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్ట్​ చేయగా.. మిగితా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

gangrape
gangrape
author img

By

Published : Jan 30, 2022, 9:40 PM IST

Gangrape: మహారాష్ట్రలో రాయ్​గడ్​లో​ పాశవిక ఘటన జరిగింది. ఓ మైనర్​పై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది

రాయ్​గఢ్​ జిల్లా పెన్​ తాలుకా వాశి సారెభాగ్​ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక​.. కొద్ది నెలల క్రితం పొరుగు గ్రామంలో జరిగిన ఓ వేడుకకు హాజరైంది. అక్కడ ఇద్దరు యువకులు పరిచమయ్యారు. కొన్ని రోజుల తర్వాత వారిలో ఒకరితో ప్రేమలో పడింది. సన్నిహితంగా ఉన్న వీడియోను చూపించి యువకుడు లైగింక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెతో శరీరకంగా కలిశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పడమే కాకుండా.. బాధితురాలి ఫోన్​ నంబరు కూడా వారికి ఇచ్చాడు. దీంతో ఆమెను బెదిరించి​.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరైన.. నారధమ్​ అనే వ్యక్తి.. కొన్ని నెలలుగా రోజూ అత్యాచారం చేసేవాడు. ఈ ఘటన స్థానికంగా దుమారం రేపింది. 15 నుంచి 20 మంది వరకు బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

ఎలా తెలిసింది?

బాధితురాలకు సమయం సందర్భం లేకుండా బాధితులు ఫోన్​ చేస్తుండేవారు. తమ కుమార్తెకు తరచూ ఫోన్లు వస్తుండటంతో తల్లిదండ్రులు.. ఆమెను నెమ్మదిగా ప్రశ్నించారు. దీంతో తల్లిదండ్రులు విస్తుపోయే వాస్తవాలు చెప్పింది బాధితురాలు.

ఈ ఘటనకు సంబంధించి.. వడ్‌ఖల్ పోలీసు స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఏడుగురు నిందితులను కోర్టులో హాజరు పరచగా.. ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

నిందితులను కాపాడే యత్నం!

బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వదంతులు వ్యాపించడంతో పలు రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు తమ ఆత్మీయులను కాపాడుకునేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు భావిస్తున్నారు. బాధితురాలు పేద కుటుంబానికి చెందినదని.. ఈ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు.

మహిళా డీఎస్పీ నియామకం

ఈ కేసును పారదర్శకంగా విచారించేందుకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్​ అలీబాగ్‌కు చెందిన సబ్​ డివిజనల్​ పోలీసు అధికారి సోనాలి కదమ్‌ను నియమించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: దారుణం.. బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.