ETV Bharat / bharat

ఇద్దరు బాలికలపై ఆరుగురు యువకులు గ్యాంగ్​​రేప్ - రాంచీ గ్యాంగ్​రేప్​

Two Girls Gang Rape: ఇద్దరు బాలికలపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

two girls gang rape
two girls gang rape
author img

By

Published : Apr 15, 2022, 11:34 AM IST

Updated : Apr 15, 2022, 11:55 AM IST

Two Girls Gang Rape: ఝార్ఖండ్​లోని రాంచీలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకుని బాలికలిద్దరూ గురువారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు.. ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలోని దుర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితులు ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం సదర్​ ఆసుపత్రికి తరలించారు.

అసలు ఏం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. బాధితుల్లో ఓ బాలికను తన వదిన పొరుగింట్లో ఉన్న యువకుడితో బయటకు పంపించింది. మార్గమధ్యలో ఆ యువకుడు బాలికను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. అంతటితో ఆగకుండా నిందితుడు తన ఐదుగురు స్నేహితులను పిలిపించాడు. వారు వచ్చాక అందరూ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే నిందితులు.. ఆ బాలికను తన స్నేహితురాలికి ఫోన్​ చేసి పిలిపిస్తేనే వదిలేస్తామని చెప్పగా.. ఆమె వెంటనే పిలిచింది. ఆమె కూడా వచ్చాక ఆరుగురు కలిసి ఇద్దరు బాలికలపై గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డారు.

ఇవీ చదవండి: రేషన్​ షాప్​లో మోదీ ఫొటో- భాజపా చీఫ్​ చేసిన పనికి..!

కోట్ల విలువైన డ్రగ్స్​ సీజ్​.. అడ్డంగా బుక్కైన నిందితులు.. సీఎం ప్రశంసలు

Last Updated : Apr 15, 2022, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.