Gang rape: పెళ్లి వేడుక కోసం పక్క ఊరికి వెళ్లిన ఓ 16 ఏళ్ల బాలికను అపహరించిన ఐదుగురు దుండగులు.. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్, జశ్‌పుర్ జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక.. సమీప గ్రామంలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గత గురువారం వెళ్లింది. రాత్రి తన స్నేహితురాలి కోసం పెళ్లి మండపం నుంచి బయటకు రాగా.. ఐదుగురు దుండగులు ఆమెను అపహరించారు. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.
ఈ ఘటనపై శనివారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. దుశ్చర్యకు పాల్పడిన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 24, 30 ఏళ్లు వయసున్న నిందితులు.. బాలిక స్వగ్రామానికి చెందిన వారేనని గుర్తించారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు జశ్‌పుర్ ఎస్పీ విజయ్ అగర్వాల్ తెలిపారు. నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: స్కార్పియో కోసం వివాహిత సజీవదహనం.. భర్త, అత్తమామలు కలిసి...