రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లిన మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు విని అక్కడకు చేరుకున్న కొందరు గ్రామస్థులు.. కాపాడాల్సింది పోయి ఆమెపైనే దాడి చేశారు. కిరోసిన్ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన.. ఝార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లాలో వెలుగు చూసింది.
ఇదీ జరిగింది: జిల్లాలోని బెంగబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత అత్యచారానికి గురైంది. ఆమెకు మద్దతుగా నిలవాల్సిన అత్తింటివారు దారుణంగా వ్యవహరించారు. గ్రామస్థులతో కలిసి ఆమెకు నిప్పంటించి సజీవ దహనం చేసేందుకు యత్నించారు. తీవ్ర గాయాలతో బాధిత మహిళ సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు సిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై అమిత్ కుమార్.
తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించింది బాధితురాలు. 'రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లగా.. సునీల్ చౌదరి అనే వ్యక్తి లాక్కెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు అరిచాను. కొందరు గ్రామస్థులు, నా భర్త పెద్ద సోదరుడు అక్కడకు వచ్చాడు. వారంతా తనపై దాడి చేస్తున్నా ఆపలేదు. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించారు. నా అరుపులతో కొంత మంది వచ్చి మంటలు ఆర్పేసి.. సదర్ ఆసుపత్రికి తరలించారు.' అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
ఇద్దరు పిల్లలు, తల్లిపై దాడి.. బాలిక మృతి
దేశ రాజధానిలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పిల్లలు, ఆమె తల్లిపై దాడి చేసిన సంఘటన ప్రేమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. వారిపై దాడి చేసేందుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
ఇదీ చూడండి: సెక్యూరిటీ గార్డును కొట్టి కట్టేసి.. పెట్రోల్ బంకుల్లో లక్షలు చోరీ
కుమారుడి మృతదేహం ఇచ్చేందుకు లంచం డిమాండ్.. తల్లిదండ్రుల భిక్షాటన