ETV Bharat / bharat

గాల్ బ్లాడర్​లో 630 రాళ్లు.. ఫ్రీగా సర్జరీ చేసిన వైద్యులు!

ఓ రోగి పిత్తాశయంలో నుంచి 630 రాళ్లను శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు వైద్యులు. గుజరాత్ అహ్మదాబాద్​లో జరిగిందీ ఈ అరుదైన ఆపరేషన్.

gall bladder stone surgery
పిత్తాశయంలోంచి 630 రాళ్ల తొలగింపు
author img

By

Published : Jul 13, 2023, 10:36 AM IST

రోగి పిత్తాశయంలో నుంచి 630 రాళ్లను తొలగించి.. వైద్యరంగంలో మైలురాయిని అందుకున్నారు అహ్మదాబాద్​కు చెందిన డాక్టర్లు. గాల్ బ్లాడర్​లో సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి ఓ ఆసుపత్రి వైద్యుల బృందం.. శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా రాళ్లను తొలగించింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు.

గుజరాత్ అహ్మదాబాద్​కు చెందిన ఓ వ్యక్తి గత కొంతకాలంగా గాల్ బ్లాడర్, సికిల్ సెస్ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడి.. మూత్ర విసర్జన సమయంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అతడి పరిస్థితి తెలుసుకొని.. నిపుణులతో కూడిన వైద్య బృందం అధునాతన సాంకేతికతతో.. ఎండోస్కోపిక్​ రెట్రోగ్రేడ్ కోలాంగియో పాంక్రియాటోగ్రఫీ (ERCP) ద్వారా శస్త్ర చికిత్స చేసింది. గాల్​ బ్లాడర్​లో ఉన్న 630 రాళ్లను తొలగించింది. పిత్తాశయంలో రాళ్లను తొలగించడానికి శస్త్ర చికిత్సలో లాపరోస్కోపిక్ కోలెసెక్టోమిని వైద్యులు ఉపయోగించారు.

రోగికి అవసరమైన వైద్య పరీక్షలన్నీ సూరత్​లో జరిగాయి. ఈ పరీక్షలకు అయిన ఖర్చంతా కాకా బా ఆసుపత్రి​ భరించింది. కాగా అతడికి ఆపరేషన్.. ఆయుష్మాన్ భారత్ పథకం కింద జరిగింది. దీంతో రోగికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండానే.. అవసరమైన చికిత్స అందిందని వైద్యులు తెలిపారు.

"కాకా బా ఆస్పత్రిలో అంకితభావంతో కూడిన నిపుణుల బృందం.. శస్త్రచికిత్స చేయడంలో విజయం సాధించింది. ఈ విజయం మరింత మందికి.. అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించడానికి దోహదం చేస్తుంది" అని కాకా బా ఆసుపత్రి వైద్యుడు, కలబుద్​ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్​ సభ్యుడు డా. భరత్ చంపానెరియా తెలిపారు.

వైద్యరంగంలో మరో ఘనత..
ఇటీవల 13 నెలల చిన్నారి రెండు కిడ్నీలను 30 ఏళ్ల వ్యక్తికి అమర్చారు బెంగళూరులోని ఫోర్టిస్​ ఆస్పత్రి వైద్యులు. ఆ ఆస్పత్రిలోని యూరో ఆంకాలజీ, రోబోటిక్ సర్జరీ సీనియర్ డైరెక్టర్​ డాక్టర్​ శ్రీహర్ష హరినాథ్​ నేతృత్వంలోని వైద్యుల బృందం.. రోబోటిక్​ ఎన్​-బ్లాక్​ అనే విధానంలో ఈ ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ శస్త్రచికిత్స​ విజయవంతం కావడం పట్ల రోగి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కథనాన్ని పూర్తిగా చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.