ETV Bharat / bharat

Gaganyaan Mission Rocket Engine : ఇస్రో దూకుడు.. 'గగన్​యాన్​' ఇంజిన్ టెస్ట్ సక్సెస్​! - చంద్రుని సల్ఫర్ చంద్రయాన్‌ 3

Gaganyaan Mission Rocket Engine Test : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిన మానవ సహిత అంతరిక్ష మిషన్ 'గగన్​యాన్​' క్రయోజనిక్ ఇంజిన్​ను విజయవంతంగా పరీక్షించింది. మరోవైపు చంద్రుడిపై సల్ఫర్​ ఉందనే విషయాన్ని రోవర్​ మరోసారి నిర్ధరించింది. ఇదే సమయంలో జాబిల్లిపై పరిశోధనల కోసం తిరుగుతున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ను విక్రమ్‌ ల్యాండర్‌ వీడియో తీసింది.

Gaganyaan Mission Rocket Engine Test
Gaganyaan Mission Rocket Engine Test
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 2:44 PM IST

Updated : Aug 31, 2023, 3:38 PM IST

Gaganyaan Mission Rocket Engine Test : చంద్రయాన్​-3 మిషన్ విజయవంతం కావడం వల్ల ఇస్రో మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిన మానవ సహిత అంతరిక్ష మిషన్ 'గగన్​యాన్​'పై పూర్తి దృష్టి సారించింది. అందులో భాగంగా తమిళనాడు.. తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో క్రయోజనిక్ ఇంజిన్​ను విజయవంతంగా పరీక్షించింది. ఇంజిన్​ను 720 సెకన్ల పాటు మండించామని ఇస్రో తెలిపింది. ఈ విజయాన్ని కీలక మైలురాయిగా అభివర్ణించింది.

గగన్​యాన్ మిషన్​లో భాగంగా ముగ్గురు మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్లుందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది ఇస్రో. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగ పరీక్షలు విజయవంతమయ్యాయి. భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించి.. అంతరిక్షంలో పరిశోధనలు చేయనున్నారు ఈ వ్యోమగాములు. అనంతరం వీరిని సురక్షితంగా తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించింది ఇస్రో.

Gaganyaan Mission Rocket Engine Test
గగన్​యాన్​ మిషన్ ఇంజిన్

చంద్రుడిపై సల్ఫర్​.. మరోసారి ధ్రువీకరించిన రోవర్​..
Sulphur On Moon Chandrayaan 3 : చంద్రయాన్‌-3 ప్రజ్ఞాన్‌ రోవర్‌ పరిశోధనలు చురుగ్గా సాగుతున్నాయి. రోవర్‌లోని మరో పరికరం జాబిల్లిపై సల్ఫర్‌ ఉందని ధ్రువీకరించింది. రోవర్‌లో ఉన్న ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్‌-APXS పరికరం సల్ఫర్‌తో పాటు.. కొన్ని ఇతర చిన్న మూలకాలను కూడా గుర్తించింది. రెండు రోజుల క్రితం రోవర్‌లోని లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ LIBS కూడా.. చంద్రుడిపై సల్ఫర్‌ ఉన్నట్లు గుర్తించింది. అయితే చంద్రుడిపై సల్ఫర్‌ ఎలా వచ్చిందనే కోణంలో శాస్త్రవేత్తలు తాజా వివరణలను అభివృద్ధి చేయాల్సి వస్తుందని ఇస్రో తెలిపింది.

సల్ఫర్‌ స్వాభావికంగానే చంద్రుడిపై ఉందా లేక అగ్నిపర్వతం లావా వల్ల ఏర్పడిందా లేక ఉల్కల కారణంగా అక్కడకు చేరిందా అనే విషయాన్ని తేల్చాల్సి ఉందని ఇస్రో పేర్కొంది. ఇస్రో విడుదల చేసిన వీడియోలో.. రోవర్‌కు అతుక్కుని ఉన్న 19 సెంటీమీటర్ల పొడవైన APXS గుండ్రంగా తిరుగుతూ.. డిటెక్టర్‌ హెడ్‌తో కలిసి చంద్రుడి ఉపరితలంపై 5 సెంటీమీటర్ల లోతున తవ్వినట్లు కనిపిస్తోంది. తద్వారా అక్కడ మట్టిని విశ్లేషించి సల్ఫర్‌ను ధ్రువీకరించింది. అహ్మదాబాద్‌లోని ఫిజకల్‌ రీసెర్చ్ ల్యాబొరేటరీ APXSను అభివృద్ధి చేసింది. అలాగే డిప్లాయ్‌మెంట్ మెకానిజమ్‌ను బెంగుళూరులోని యూఆర్​ రావు శాటిలైట్ సెంటర్‌ అభివృద్ధి చేసిందని ఇస్రో పేర్కొంది.

చంద్రుడిపై రోవర్​ చక్కర్లు...
Chandrayaan 3 Pragyan Rover Video : జాబిల్లిపై పరిశోధనల కోసం తిరుగుతున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ను విక్రమ్‌ ల్యాండర్‌ వీడియో తీసింది. చంద్రుడిపై రోవర్‌ సురక్షితమైన ప్రదేశాల్లోనే తిరుగుతోందని ఇస్రో పేర్కొంది. ఈ మేరకు గిరాగిరా రోవర్‌ తిరుగుతున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. చందమామ ఉపరితలంపై పిల్లలు ఉల్లాసంగా ఆడుతూ ఉంటే తల్లి చూస్తున్నట్లు లేదూ అంటూ ఇస్రో వ్యాఖ్యానించింది.

  • Chandrayaan-3 Mission:
    The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera.

    It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately.
    Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp

    — ISRO (@isro) August 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ISRO Aditya L1 Mission : 'మిషన్​ సూర్య' లాంఛ్​ రిహార్సల్​ సక్సెస్.. నింగిలోకి వెళ్లడమే తరువాయి..

ISRO Aditya L1 Mission Launch Date In India : ఇస్రో 'మిషన్​ సూర్య'.. సెప్టెంబర్ 2న ఆదిత్య L​-1 ప్రయోగం

Last Updated : Aug 31, 2023, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.