ETV Bharat / bharat

Gaddar Last Rites with Official Ceremonies : మూగబోయిన ప్రజా ఉద్యమ గొంతుక.. నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు - అల్వాల్‌లోని మహాబోధి స్కూల్‌లో గద్దర్ అంత్యక్రియలు

Gaddar Last Rites with Official Ceremonies : నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా.. అంటూ రక్త సంబంధాన్ని రంగరించిన గొంతుక.. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. అంటూ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు పతాకమై నిలిచిన గీతిక.. జనం గుండెల్లో నిత్యం నాట్యమాడే పాటమ్మను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. బుర్రకథ విఠల్, తెలంగాణ ఉద్యమానికి వన్నెలద్దిన గద్దర్‌.. అరుణ వర్ణంలో ఒదిగిపోయారు. అధికార లాంఛనాలతో నేడు అంత్యక్రియలు జరగనున్నాయి.

Gaddar funeral at Mahabodhi School in Alwal
Gaddar Last Rites with Official Ceremonies
author img

By

Published : Aug 7, 2023, 7:57 AM IST

Gaddar Last Rites with Official Ceremonies : మూగబోయిన ప్రజా ఉద్యమ గొంతుక.. నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Gaddar funeral at Mahabodhi School in Alwal : ఉద్యమ గళం మూగబోయింది. తన పాటతో.. ఆటతో చైతన్యం నింపిన ప్రజా యుద్ధ నౌక నింగికేగింది. 76 ఏళ్ల ప్రజా గాయకుడు గద్దర్‌ తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అమీర్‌పేట అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అల్వాల్‌లోని ఇంటి వద్ద జులై 20న గద్దర్‌ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేర్పించారు. నాటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు.

Gaddar Passed Away : గుండెలో సమస్య ఉండటంతో ఈ నెల 3న వైద్యులు ఆయనకు బైపాస్‌ సర్జరీ చేశారు. శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో హుషారుగా పాటలు కూడా పాడిన ఆయన.. త్వరగా కోలుకుని తిరిగి వస్తానని కుటుంబసభ్యులతో శనివారం రాత్రి కూడా మాట్లాడారు. అనూహ్యంగా ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తడంతో గద్దర్‌ ఆరోగ్యం విషమించింది. రక్తపోటు, మధుమేహంతో బాధపడుతుండటం, వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడంతో కోలుకోలేకపోయారు. అత్యవసర వైద్యం అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు.

Gaddar songs :'గద్దర్​'కు నంది అవార్డు తెచ్చిపెట్టిన వెండితెర​ సాంగ్స్​ తెలుసా?.. అసలా పేరు ఎలా వచ్చిందంటే?​

Gaddar funeral with State : గద్దర్‌ మృతి వార్తను తెలుసుకొని అమీర్‌పేట ఆసుపత్రి వద్దకు ఆయన అభిమానులు, రాజకీయ నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున చేరుకుని గద్దర్‌ అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే, మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం గద్దర్‌ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించారు. అక్కడికి ప్రజలు, అభిమానులు, రాజకీయ నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు అంబులెన్స్‌లో గద్దర్‌ భౌతికకాయాన్ని స్టేడియానికి తీసుకొచ్చి నివాళులు అర్పించారు. గద్దర్‌ పార్థివదేహానికి మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు. గద్దర్‌ భౌతికకాయానికి నివాళులు అర్పించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కుటుంబసభ్యులను ఓదార్చారు.

Gaddar son-in-law reaction : ఐసీయూలోనూ పాటలు పాడటం ఆపలేదు​ : గద్దర్ అల్లుడు

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..: గద్దర్‌ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవితాంతం సమాజానికి ఆయన చేసిన త్యాగాలకు, ప్రజాసేవకు సూచికగా ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. గద్దర్‌ కుటుంబసభ్యులతో మాట్లాడి, సంబంధిత చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఎల్బీ స్టేడియం నుంచి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్‌లోని భూదేవినగర్‌లోని గద్దర్‌ నివాసం వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌ మీదుగా అంతిమయాత్ర సాగనుంది. ఇంటి వద్ద ప్రజల కోసం కొద్దిసేపు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అల్వాల్‌లోనే గద్దర్‌ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు చేయనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

Governor and CM KCR Condoles on Gaddar Death : గద్దర్​ కుటుంబానికి సంతాపం తెలిపిన గవర్నర్​, సీఎం

గద్దర్‌ 1947 ఆగస్టు 4న మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్‌. నిజామాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో ప్రాథమిక, ఉన్నత, ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేశారు. 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. తర్వాత ఆ ఉద్యోగం వదులుకున్నారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. రెండో కుమారుడు చంద్రుడు 2003లో అనారోగ్యంతో మృతి చెందారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ కూడా ఒకరు. ఎన్నో ప్రజా ఉద్యమాలను ఆయన ముందుండి నడిపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తన ఆట, పాటతో ప్రజలను ఉత్తేజపరిచారు. పలు సినిమాల్లో పాటలు రాయడంతో పాటు నటించి మెప్పించారు. పీపుల్స్‌వార్‌ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో నకిలీ ఎన్‌కౌంటర్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ రోజు తగిలిన తూటా ఇంకా ఆయన శరీరంలోనే ఉంది.

Gaddar Passed Away : మూగబోయిన ఉద్యమగళం.. ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత..

Leaders Condolence on Gaddar Death : 'గద్దర్​ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.