ETV Bharat / bharat

గ్యాక్‌ ఫ్రూట్‌ సాగు.. లాభాలు బహుబాగు - గ్యాక్ పండ సాగు

Gac fruit Cultivation: కేరళలో రైతులు విభిన్నమైన పంటలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. అంతర్జాతీయంగా గ్యాక్‌ పండ్లకు ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ పండుకు ఉన్న ప్రాముఖ్యం ఏంటీ? ఏ విధంగా సాగు చేస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Gac fruit Cultivation
గ్యాక్‌ ఫ్రూట్‌
author img

By

Published : Mar 24, 2022, 10:51 AM IST

Updated : Mar 24, 2022, 11:59 AM IST

గ్యాక్‌ ఫ్రూట్‌

Gac fruit Cultivation: దేశీయంగా రైతులు పలు రకాల పంటలను పండిస్తుంటారు. అందులో కొన్ని పంటలు అంతంత మాత్రం దిగుబడి ఇస్తుండగా.. మరికొన్ని అధిక లాభాలు తెచ్చిపెడుతుంటాయి. ఇప్పుడు కేరళలో రైతులు వినూత్నమైన పండ్ల సాగుచేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. అంతర్జాతీయంగా గ్యాక్‌ పండ్లకు ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ పండుకు ఉన్న ప్రాముఖ్యం ఏంటీ? ఏ విధంగా సాగు చేస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వియత్నాంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన గ్యాక్‌ ఫ్రూట్‌ను "హెవెన్‌ ఫ్రూట్‌"గా పిలుస్తారు. దీనిని పలు దేశాల్లో పండిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. ప్రధానంగా వియత్నాం, మలేసియా, థాయిలాండ్‌లో సాగుచేస్తుండగా.. వియత్నాం, చైనాలో సంప్రదాయ వైద్య విధానంలో ఉపయోగిస్తారు. బీటా కెరోటిన్, ఒమేగా, కొవ్వు ఆమ్లాలను ఇది కలిగి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గ్యాక్‌ ఫ్రూట్‌కు ఉన్న డిమాండ్‌ను కేరళ రైతులు అందిపుచ్చుకుంటున్నారు.

కేరళలోని కాసర్‌గోడ్‌, కోజికోడ్‌, మంగళపురం జిల్లాల్లో పలువురు రైతులు గ్యాక్‌ ఫ్రూట్‌ను పండిస్తున్నారు. పుచ్చకాయ కుటుంబానికి చెందిన ఈ పండు పక్వానికి వచ్చే ముందు నాలుగు రంగుల్లోకి మారుతుంది. ప్రకాశవంతమైన ఎరుపురంగులోకి మారినప్పుడు పంట కోయడానికి సిద్ధంగా ఉందని రైతులు భావిస్తారు. ఈ మొక్కలు ఆడ, మగ రకాలుగా ఉంటాయి. రైతులు పంటపొలాల్లో వీటిని పక్కపక్కనే నాటితే పరాగసంపర్కం చెందుతాయి. సహజ క్రిమి పరాగసంపర్కానికి బదులుగా చేతి పరాగసంపర్కం చేసినప్పుడు మెరుగైన దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.

మార్కెట్‌లో మంచి ధర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. కిలో పండ్ల ధర వెయ్యి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అధిక ధరతో పాటు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండటం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్యాక్‌ ఫ్రూట్‌ సాగు చేసేందుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. లాభాలు ఇలాగే వస్తే.. పంట సాగు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: ఆ ఒక్క పిల్లితో రూ. 100 కోట్ల నష్టం.. ఎలా?

Last Updated : Mar 24, 2022, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.