భారత్ అధ్యక్షతన దిల్లీ వేదికగా శనివారం, ఆదివారం జరగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట మొరాకో భూకంపంలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విపత్కర సమయంలో మొరాకోకు భారత్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదిక వద్దకు తొలుత చేరుకుని ప్రపంచ దేశాధినేతలకు ఘన స్వాగతం తెలిపారు.
G20 Summit 2023 Delhi : దిల్లీలో జీ20 సదస్సు షురూ.. మొరాకో భూకంప మృతులకు మోదీ సంతాపం.. - జీ20 సమ్మిట్ ఇండియా 2023 షెడ్యూల్
Published : Sep 9, 2023, 9:27 AM IST
|Updated : Sep 9, 2023, 10:53 AM IST
10:50 September 09
10:27 September 09
- దిల్లీ: ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం వేదికగా జీ-20 సదస్సు
- భారత్ మండపానికి చేరుకుంటున్న వివిధ దేశాధినేతలు, ప్రపంచసంస్థల అధిపతులు
- దేశాధినేతలకు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ
- బంగ్లా ప్రధాని హసీనా, సింగపూర్ ప్రధాని లీ సేన్‌కు స్వాగతం పలికిన మోదీ
- ఈజిప్డ్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్-సిసీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌కు మోదీ స్వాగతం
- దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్‌కు మోదీ స్వాగతం
- జపాన్ ప్రధాని కిషిద, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ప్రధాని స్వాగతం
- జర్మనీ ఛాన్సలర్ ఓలఫ్ షోల్జ్‌కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ
- అమోరికా అధ్యక్షుడు జోబైడెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావోస్‌కు మోదీ స్వాగతం
- ఇండోనేషియా అధ్యక్షుడు జకో విడిడోకు స్వాగతం పలికిన మోదీ
- భారత్ మండపానికి చేరుకున్న డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్
- భారత్ మండపం వద్దకు చేరుకున్న ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్
09:29 September 09
ప్రపంచ దేశాధినేతలకు మోదీ స్వాగతం
జీ 20 సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రపంచ దేశాధినేతలతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులకు స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మరోవైపు ఈ సదస్సు దృష్ట్యా తన సందేశాన్ని తెలిపారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. సమగ్ర, స్థిరమైన మానవాళి అభివృద్ధి కోసం వసుధైవ కుటుంబకం అనే స్ఫూర్తితో భారత్ ఈ సమావేశాలు నిర్వహిస్తోందని కొనియాడారు.
08:57 September 09
G20 Summit 2023 Delhi : భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సు కాసేపట్లో ప్రారంభం కానుంది. అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన దిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. అతిథులకు ఘన స్వాగతం పలికేందుకు సదస్సు జరిగే భారత మండపానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్వాగతం పలికారు. ఈ సదస్సు కోసం భారత్.. కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేసింది.
ద్రవ్యోల్బణం, మాంద్యం.., రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభాలపై ప్రపంచానికి దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా జీ-20 సదస్సు జరుగుతోంది. వసుధైక కుటుంబం పేరుతో ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు నినాదంగా భారత్ ఈ సదస్సు నిర్వహిస్తోంది. సదస్సు ద్వారా మానవాళి కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధికి కొత్త బాటలు వేస్తామని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పలు అంశాలపై అమెరికాతో చైనా, రష్యా విభేదిస్తున్న వేళ, డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జీ20 సభ్యదేశాలతోపాటు.. బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, యూఏఈ, స్పెయిన్, సింగపుర్, ఒమన్, నైజీరియా, నెదర్లాండ్స్‌ను కూడా సదస్సు కోసం భారత్ ఆహ్వానించింది. జీ20 సదస్సులో పాల్గొనే అతిరథుల్లో చాలా మంది ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు.