ETV Bharat / bharat

G20 Summit 2023 : జీ20 నేతల కోసం హోటళ్లు బుక్​.. 250పైగా రకాల వంటలతో ఆతిథ్యం - జీ20 సదస్సు అతిథుల వంటల మెనూ

G20 Summit 2023 Hotel Booking : జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చే ప్రపంచ దేశాధినేతలకు ఘనంగా ఆతిథ్యమిచ్చేందుకు దేశ రాజధాని దిల్లీ సిద్ధమవుతోంది. ఇప్పటికే భద్రతా పరమైన ఏర్పాట్లు దాదాపు పూర్తి కాగా అతిథులకు స్వాగతం పలికేందుకు దిల్లీలోని టాప్‌ హోటళ్లను అధికారులు బుక్ చేశారు. సదస్సు కోసం వచ్చే ప్రతినిధుల కోసం వివిధ రకాల వంటకాలను పరిచయం చేసేందుకు హోటళ్లు ఏర్పాట్లు చేస్తున్నాయి.

G20 Summit 2023 Hotel Booking
G20 Summit 2023 Hotel Booking
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 10:48 PM IST

G20 Summit 2023 Hotel Booking : అతిథి మర్యాదలకు ప్రసిద్ధి చెందిన భారత్.. జీ-20 సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే సమావేశానికి వచ్చే ప్రపంచ దేశాధినేతలకు మంచి ఆతిథ్యం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం ఇప్పటికే దిల్లీలోని ప్రముఖ హోటళ్లను బుక్‌ చేశారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులకు భారత అతిథ్యాన్ని పరిచయం చేసే పనిలో హోటళ్లు నిమగ్నమయ్యాయి. ప్రతినిధులను స్వాగతం పలకడం దగ్గర నుంచి వారికి బస, వంటకాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. హోటళ్లను వివిధ రకాల పూలతో అందంగా అలంకరిస్తున్నాయి.

G20 Summit 2023 Dinner Menu : అతిథులకు విదేశీ వంటకాలతో పాటు భారత రుచులను పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజ్ హోటల్ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ దేశాధినేతలు బస చేసే గదులను పోలీసులు, భద్రతా సిబ్బంది ఇప్పటికే తనిఖీ చేశారనీ చెప్పారు. జీ20 అతిథులకు అంతర్జాతీయ వంటకాలతో సహా 250కి పైగా రుచికరమైన వంటకాలను అందించాలని లలిత్ హోటల్ ప్రణాళిక చేస్తోంది. 'శ్రీ అన్న' పథకాన్ని దృష్టిలో ఉంచుకుని, తృణధాన్యాల ఆధారిత వంటకాలను కూడా చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హోటల్ నిర్వాహకులు పరిశీలిస్తున్నారు.

G20 Summit 2023 Delhi Date Venue : దిల్లీలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్- IECC (భారత మండప)లో.. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో (G20 Summit 2023 Schedule) దిల్లీలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనుంది. సమావేశం దృష్ట్యా భద్రతా పరమైన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సదస్సు పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో అణువణువూ జల్లెడ (G20 summit 2023 delhi security) పడుతున్నారు. హెలికాప్టర్ ఆధారిత డ్ర్రిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాధినేతలు సదస్సుకు రానుండటంతో దిల్లీలో సెప్టెంబర్ 8నుంచి 10 వరకు అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు కేజ్రీవాల్ ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది.

Biden India Visit G20 Summit : భారత్​కు బైడెన్.. ప్రధాని మోదీతో ప్రత్యేక​ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

Worlds Tallest Nataraja Statue Delhi : 19 టన్నులు.. 8 లోహాలు.. భారీ నటరాజ విగ్రహం.. దిల్లీకి పయనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.