ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల్లో 1700 మంది పోలీసులు, 481 మంది వైద్యులకు కరోనా - కొవిడ్​ బారిన పడుతున్న పోలీసులు

Frontline workers Covid 19: దిల్లీ, మహారాష్ట్రలో కరోనా కోరలు చాస్తోంది. ఒకవైపు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంటే.. మరో వైపు కొవిడ్ ఫ్రంట్​ లైన్​ వర్కర్స్​ కూడా వైరస్​ బారిన పడుతున్నారు. దిల్లీలో 1,700 మంది పోలీసులకు వైరస్​ సోకితే.. మహారాష్ట్రలో 481 మంది వైద్యులు మహమ్మారి బారిన పడ్డారు.

1,700 Delhi Police personnel test positive for COVID
దిల్లీలో 1,700 పోలీసులకు కరోనా
author img

By

Published : Jan 12, 2022, 2:29 PM IST

Frontline workers Covid 19: కొవిడ్​ ఫ్రంట్​లైన్ వారియర్స్​గా ఉన్న పోలీసులు, వైద్యులుపై కరోనా విరుచుకుపడుతోంది. సుమారు 1,700 మంది దిల్లీ పోలీసులు వైరస్​ బారిన పడినట్లు దిల్లీ పోలీస్​ శాఖ తెలిపింది. కేవలం జనవరి 1 నుంచి 12వ తేదీ లోపే ఈ కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది.

సోమవారం వరకు డిపార్ట్​మెంట్​లో వైరస్​ సోకిన వారి సంఖ్య 1,000 గా ఉండగా.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మరో 700 కేసులు బయటపడ్డాయి. సమావేశాలు అన్నీ వర్చువల్​గా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్​ సోకిన వారు హోం క్వారెంటైన్​కు పరిమితం కావాలని సూచించారు.

మహాలో 481 మంది వైద్యులకు...

మహారాష్ట్రలో వైరస్​ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనితో పాటే వైరస్​ బారిన పడే వైద్యుల సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది. ఇప్పటి వరకు సమారు 481 మంది రెసిడెంట్​ వైద్యులు వైరస్​ బారిన పడినట్లు మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్​ రెసిడెంట్​ డాక్టర్స్​ ప్రెసిడెంట్​ డా. అవినాష్​ ధహిపాలే తెలిపారు.

కెప్టెన్​కు కరోనా...

పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్​ కరోనా బారిన పడ్డారు. ఇటీవల వైరస్​ పరీక్షలు నిర్వహించగా కొవిడ్​ సోకినట్లు తెలిందని తెలిపారు. ప్రస్తుతం హోం క్వారెంటైన్​లో ఉన్నట్లు తెలిపిన ఆయన.. తనను కలిసిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

దిల్లీ అసెంబ్లీ స్పీకర్​కు కొవిడ్​..

దిల్లీ అసెంబ్లీ స్పీకర్​ రాం నివాస్​ గోయల్​ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని పరీక్ష చేయించుకోగా.. కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఇంటికే పరిమితం అయినట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరారు.

ఇవీ చూడండి:

భాజపా కేంద్ర కార్యాలయంలో 50 మందికి కరోనా

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 1.95 లక్షల మందికి వైరస్​

'అక్కడ చిన్నారులకు 100 శాతం వ్యాక్సినేషన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.