ETV Bharat / bharat

పర్యావరణం నుంచి 'దేశద్రోహం' వరకు.. ఎవరీ దిశ? - రైతు చట్టాలు

జనవరి 26న దిల్లీ హింసాత్మక ఘటనలు, టూల్​ కిట్ వ్యవహారంలో 21ఏళ్ల యువతి దిశ శనివారం అరెస్టయ్యారు. ఆమె అరెస్టుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అరెస్టును... ప్రజాస్వామ్యంపై దాడిగా దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇంతకీ ఎవరీ దిశ? టూల్​ కిట్​తో ఏంటి సంబంధం?

From climate activist to 'Toolkit Editor', who is Disha Ravi?
పర్యావరణ కార్యకర్త నుంచి 'దేశద్రోహం' వరకు .. దిశ రవి ఎవరు?
author img

By

Published : Feb 15, 2021, 1:57 PM IST

Updated : Feb 15, 2021, 2:51 PM IST

టూల్ కిట్ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల దిశ రవిని దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం శనివారం అరెస్టు చేసింది. ఆమెకు కోర్టు 5 రోజుల కస్టడీ విధించింది. టూల్​ కిట్​ వల్లే జనవరి 26న రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిందన్నది పోలీసుల వాదన.

From climate activist to 'Toolkit Editor', who is Disha Ravi?
దిశ రవి అరెస్టు

ఏమిటా టూల్​ కిట్?

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో 3 నెలలుగా అన్నదాతలు ఉద్యమిస్తున్నారు. వారికి మద్దతుగా నిలిచారు పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్​బర్గ్. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు​ ట్విట్టర్​లో ఓ టూల్​ కిట్​ను పోస్టు చేశారు.

టూల్​ కిట్​లో ఏముంది?

రైతుల ఉద్యమానికి అండగా నిలబడాలని అనుకునేవారికి కార్యాచరణ ప్రణాళికే టూల్ కిట్. రైతులకు మద్దతుగా ట్విట్టర్​లో పోస్టులు, ప్రజా ప్రతినిధులకు వినతులు, ఆర్థిక సహాయం, అంబానీ, అదానీ సంస్థల ఉత్పత్తుల బహిష్కరణ, క్షేత్రస్థాయిలో(ప్రభుత్వ కార్యాలయాలు, భారత రాయబార కార్యాలయాలు, మీడియా సంస్థల) వద్ద నిరసన వంటివి చేయాలని పిలుపునిచ్చారు. దాంతో పాటే మరిన్ని వివరాల కోసం కొన్ని లింకులను పొందుపరిచారు.

రైతుల ఆందోళన

దిశ రవి ఎవరు? టూల్​ కిట్​తో సంబంధమేంటి?

దిశ రవి.. బెంగళూరుకు చెందిన 21ఏళ్ల పర్యావరణ ఉద్యమకారిణి. భారత్​లో వాతావరణ సంక్షోభంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ మార్పులపై వార్తా పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. ఆమె సొంతూరు సోలదేవనహళ్లి. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల నుంచి డిగ్రీ తీసుకున్నారు. 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్' అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలు దిశ.

పర్యావరణంపై ప్రేమ ఎందుకంటే..

"నేను పర్యావరణ కార్యకర్తగా మారడానికి మా తాత, నాన్నమ్మ కారణం. వారు వ్యవసాయం చేస్తారు. వాతావరణ సంక్షోభం ప్రభావంతో వారు ఇబ్బందులు పడేవారు. దాని గురించి చిన్నప్పుడు తెలిసేది కాదు. పర్యావరణం గురించి అప్పుడు మాకు బోధించేవారు కాదు. పరిశోధించిన తర్వాతే వాతావరణ సంక్షోభం అంటే ఏమిటో అర్థమైంది" అని 2020లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దిశ.

దిశ రవి

'టూల్ కిట్ కుట్రదారు..'

గ్రెటా షేర్​ చేసిన టూల్​ కిట్​ రూపకల్పన, వ్యాప్తిలో దిశ కీలక కుట్రదారని పోలీసులు అంటున్నారు. అందుకోసం వాట్సాప్​లో ఆమె ఓ గ్రూప్​ నిర్వహించినట్లు చెప్పారు. అందులో భాగస్వాములైన మరికొందరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో వారు భారత్​కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్థాన్ అనుకూల 'పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్'​ సంస్థతో చేతులు కలిపారని వివరించారు. దిశనే గ్రెటాకు ఈ టూల్​ కిట్​ షేర్ చేశారని పోలీసులు తెలిపారు.

దిశపై దేశ ద్రోహం సహా కుట్ర, విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి పలు అభియోగాలతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా మరికొన్ని అరెస్టులు జరుగుతాయని దిల్లీ పోలీసులు చెబుతున్నారు.

ఖండించిన కేజ్రీవాల్..

దిశ రవి అరెస్టును ఖండించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. " ఇది ప్రజాస్వామ్యంపై ఎన్నడూ చూడని దాడి. రైతులకు మద్దతివ్వడం నేరం కాదు." అని ఆయన అన్నారు.

ఇదీ చూడండి: 'గ్రెటా, రిహానా మద్దతిస్తే తప్పేంటి?'

Last Updated : Feb 15, 2021, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.