ETV Bharat / bharat

ఒమిక్రాన్​పై టీకాలు పని చేస్తాయా? నిపుణుల మాటేంటి? - south africa covid variant

Omicron variant India: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. రోజుల వ్యవధిలోనే దాదాపు 30 దేశాలకు పాకేసింది. భారత్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వేరియంట్​పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్‌లు పని చేస్తాయా? లేదా? దేశంలో కరోనా మూడో దశ వస్తుందా? వంటి సందేహాలను నివృతి చేసే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం.

COVID Variant Omicron
COVID Variant Omicron
author img

By

Published : Dec 3, 2021, 6:40 PM IST

Omicron variant India: ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తూనే ఉంది. కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ.. ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. మనిషి రోగనిరోధక శక్తికి పరీక్ష పెడుతూ.. దశలవారీగా ఉత్పరివర్తన చెందిన వైరస్​.. అరకోటి మందికిపైగా పొట్టన పెట్టుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్​.. భారత్​కు కూడా వ్యాపించింది. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో ఎన్నో అనుమానాలు.. ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాంటి సందేహాలను నివృతి చేసేందుకు ప్రయత్నించింది కేంద్ర ప్రభుత్వం.

ఏంటీ ఒమిక్రాన్ వేరియంట్​​? ఎందుకు అంత భయం?

What is omicron variant: దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్​ను బి.1.1.529గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేరియంట్​ చాలా అసాధారణమైన వైరస్ ఉత్పరివర్తనాల కలయిక అని తెలిపారు. ఇది రోగనిరోధక శక్తిని ఏమార్చి.. విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనికి వ్యాక్సిన్ల నుంచి తప్పించుకోగల లేదా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉంటే.. పెను ముప్పుగా మారవచ్చు.

ప్రస్తుతమున్న టెస్టింగ్ పద్ధతులు ఒమిక్రాన్‌ను గుర్తించగలవా?

కరోనా నిర్ధరణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమైన పద్ధతి ఆర్​టీ-పీసీఆర్​. ఈ విధానంతో వైరస్‌లోని నిర్దిష్ట జన్యువులైన స్పైక్​(ఎస్​), ఎన్వలప్డ్​(ఈ) న్యూక్లియోకాప్సిడ్​(ఎన్​) సహా పలు జన్యువులను గుర్తించవచ్చు. దీని ద్వారా వైరస్​ ఉనికిని నిర్ధరించవచ్చు. అయితే కొన్నిసార్లు ఎస్​ జన్యువు లేనట్లు (ఎస్​ జీన్​ డ్రాప్​ అవుట్​) ఫలితాలు వచ్చే అవకాశముంది. ఎస్ జీన్​ అనేది మిగతా వైరల్ జీన్స్​పైన పరిశోధన చేస్తుంటే బయటపడింది. ఇది ఒమిక్రాన్​పై పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ తుది నిర్ధరణకు జెనోమిక్ సీక్వెన్సింగ్ అవసరం.

ఎంత జాగ్రత్తగా ఉండాలి?

ఒమిక్రాన్‌ను 'ప్రపంచస్థాయి ఆందోళన కలిగించే వైరస్‌ రూపాంతరం'గా(వేరియంట్​ ఆఫ్​ కన్సర్న్​) డబ్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ వేరియంట్​కు రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం, వేగంగా వ్యాపించే లక్షణం, ఒమిక్రాన్​లోని స్పైక్​ ప్రోటీన్​ విపరీతంగా పరివర్తన చెందడం, రీఇన్​ఫెక్షన్ల కారణంగా భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం ఉండటం సహా పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని వేరియంట్​ ఆఫ్​ కన్సర్న్​గా పేర్కొంది. ఈ వేరియంట్​పై ప్రస్తుత కరోనా టీకాలు ప్రభావంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి కొత్త వేరియంట్​ పట్ల జాగ్రత్తగా మసులుకోవాలి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కరోనా మొదటి రెండు దశల్లో తీసుకున్న జాగ్రత్తలే ఇప్పుడూ తప్పక పాటించాలి. ముక్కు, మూతిని కప్పేలా సరిగ్గా మాస్క్​ ధరించడం, వ్యాక్సినేషన్​(ఒకవేళ తీసుకోకపోతే), భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలి.

కరోనా మూడో దశ వస్తుందా?

COVID Variant Omicron: దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ఒమిక్రాన్​ కేసులు సంఖ్య పెరుగుతోంది. దాని లక్షణాలను బట్టి.. భారత్​ సహా మరిన్ని దేశాల్లో వైరస్​ వ్యాపించే అవకాశముంది. అయితే కేసుల పెరుగుదల స్థాయి, పరిమాణం, వ్యాధి తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియలేదు. భారత్​లో వ్యాక్సినేషన్​ శరవేగంగా సాగుతుండటం, డెల్టా వేరియంట్​ కేసులు ఎక్కువగా బయటపడి, రోగనిరోధక శక్తి మెరుగుపడటం వల్ల.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉండవచ్చు. దీనిపై శాస్త్రీయ ఆధారాల కోసం పరిశోధన కొనసాగుతోంది.

ఒమిక్రాన్​పై ప్రస్తుత వ్యాక్సిన్లు పని చేస్తాయా?

Vaccine efficacy on Omicron: ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్​పై పనిచేయవని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ స్పైక్ ప్రొటీన్​లోని కొన్ని ఉత్పరివర్తనలు ప్రస్తుత టీకాల సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. అయితే టీకాలు కొంతవరకు వైరస్​ నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణలు భావిస్తున్నారు. ఏదేమైన టీకా తీసుకోవడం మేలు.

భారత్​ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

భారత్​ ఒమిక్రాన్​ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధమవుతోంది. వైరస్​ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తోంది. మరోవైపు చికిత్సా విధానాలను అభివృద్ధి చేసి.. అమలు చేస్తోంది. దేశ పౌరులను అప్రమత్తం చేస్తూ.. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.

వేరియంట్స్​ ఎందుకు పుడతాయి?

శరీరంలో వైరస్ ఎక్కువ కాలం ఉంటే.. రూపాంతరం చెంది, అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అయితే అన్ని రకాల వైరస్​లు ప్రమాదకరమైనవి కావు. అన్నివేళల వాటిని గుర్తించలేం. అంటువ్యాధులు తీవ్రమైనప్పుడే వాటికి ప్రాధాన్యం ఇస్తాం. అంటువ్యాధులను నిర్మూలించడమే వేరియంట్లను నివారించడానికి ఏకైక మార్గం.

ఇదీ చూడండి: covid new variant: కరోనా కొత్త వేరియంట్​.. డెల్టా కంటే ప్రమాదకరమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.