ETV Bharat / bharat

పేదల పాలిట 'జ్ఞాన వృక్షం'.. ఫ్రీగా ఐఐటీ కోచింగ్.. ఇప్పటికే 150 మందికి సీట్లు! - గయా

Free IIT coaching in Bihar: ఐఐటీ కల సాకారానికి కోచింగ్​, వసతి వంటి వాటికే రూ.లక్షల్లో ఖర్చవుతుంది. దానిని భరించలేని పేద విద్యార్థులకు.. ఐఐటీ కలగానే మిగిలిపోతోంది! అలాంటి వారు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉచితంగా శిక్షణతో పాటు పుస్తకాలను అందిస్తోంది బిహార్​లోని పట్వాటోలీ కోచింగ్ ఇన్​స్టిట్యూట్​.

Free IIT coaching in Bihar
కోచింగ్​ సెంటర్​లో చదువుకుంటున్న విద్యార్థులు
author img

By

Published : Apr 21, 2022, 5:31 PM IST

పేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ కోచింగ్​

Free IIT coaching in Bihar: రూ.లక్షల్లో ఖర్చయ్యే ఐఐటీ కోచింగ్​ను.. ఎన్నో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా అందిస్తోంది బిహార్​ గయాలోని పట్వాటోలీ కోచింగ్ సెంటర్. ఇక్కడ చదువుకొని వెళ్లిన ఎందరో ఐఐటియన్లే ప్రస్తుతం దీనిని నిర్వహిస్తున్నారు. వారితో పాటు దేశవిదేశాల్లోని ఇంజినీర్లు కూడా బోధన, ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. పేద విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవడంలో అండగా నిలుస్తున్నారు. డబ్బులు లేని కారణంగా ఎవరూ చదువుకు దూరం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో ఈ కోచింగ్​ సెంటర్​ను ప్రారంభించారు చంద్రకాంత్​ పాటేకర్.

"చదువుకోవడానికి వనరులు లేని విద్యార్థులకు మేము సహాయం చేస్తాం. ఈ కార్యక్రమం 2013లో ప్రారంభమైంది. ఆ సమయంలో మా స్నేహితుడు ఐఐటీలో చదవాలనుకొని.. డబ్బులు లేకపోవడం వల్ల ఆగిపోయాడు. కానీ మా దగ్గర తగినంత ఆర్థిక శక్తి ఉన్నప్పుడు.. డబ్బుల కారణంగా ఎవరూ చదువుకు దూరం కాకూడదని అప్పుడు నిర్ణయించుకున్నాం. అందుకే ఈ కోచింగ్​ సెంటర్​ ప్రారంభించాం."

-చంద్రకాంత్​ పాటేకర్, పట్వాటోలీ స్థాపకుడు

ఈ సంస్థలో 'వృక్ష' అనే గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడ విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా ఇస్తారు. ప్రస్తుతం విదేశాల్లో, భారత్​లోని బ్లూచిప్​ కంపెనీల్లో పనిచేస్తున్న ఇంజినీర్ల ఆర్థిక సహకారంతో ఈ కోచింగ్ సెంటర్​లోని లైబ్రరీని నిర్వహిస్తున్నారు. గతేడాది ఎనిమిది మంది విద్యార్థులు పట్వాటోలీ నుంచి ఐఐటీ సాధించగా, మొత్తంగా సుమారు 150 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణలైనట్లు చంద్రకాంత్ తెలిపారు.

Free IIT coaching in Bihar
కోచింగ్​ సెంటర్​లో చదువుకుంటున్న విద్యార్థులు

"1992లో పట్వాటోలీ నుంచి జితేంద్ర అనే యువకుడు ఐఐటీ పరీక్ష పాసయ్యాడు. ఆ తర్వాత అతడికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి గ్రామంలోని చాలా మందికి అతడు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అంతేకాకుండా నైతికంగా, ఆర్థికంగా మద్దతుగా నిలుస్తున్నాడు. గత ఏడాది ఎనిమిది మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 150 మంది వరకు ఐఐటీ, ఎన్​ఐటీలకు వెళ్లారు. "

- చంద్రకాంత్​ పాటేకర్​, పట్వాటోలీ స్థాపకుడు

పూర్వవిద్యార్థి జితేంద్రను చూసి జేఈఈ సాధించాలని విద్యార్థులు కలలు కనడం ప్రారంభించారని తెలిపారు చంద్రకాంత్​. వృక్ష-బీ ది ఛేంజ్ అనే లైబ్రరీని ఏర్పాటు చేయడంలో జితేంద్రనే సహకారం అందించినట్లు చెప్పారు. మొదటి నుంచి అన్ని విధాలుగా జితేంద్ర సహాయం చేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: దేశాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన రష్యా అమ్మాయి, ఝార్ఖండ్ అబ్బాయి

ప్రేమ కోసం పురుషుడిలా మారిన మహిళ.. చివరకు ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.