ETV Bharat / bharat

'దిల్లీలో వయోజనులందరికీ ఉచితంగా టీకా'

దిల్లీలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కొవిడ్​ టీకా ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్ వెల్లడించారు. అదే సమయంలో వ్యాక్సిన్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం, తయారీ సంస్థలకు విజ్ఞప్తి చేశారు.

Free COVID-19 vaccine for those age above 18 years in Delhi
దిల్లీలో వయోజనులందరికీ ఉచితంగా కరోనా టీకా
author img

By

Published : Apr 26, 2021, 2:37 PM IST

దిల్లీలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందిస్తామని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. 1.34 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్‌ కొనుగోలుకు ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ కొనుగోలును వేగవంతం చేసి.. ప్రజలకు వాటిని అందించేందుకు దిల్లీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని కేజ్రీవాల్‌ తెలిపారు.

కరోనా వ్యాక్సిన్లకు ఒకే ధర ఉండాలన్న కేజ్రీవాల్.. టీకా ధరను తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా టీకా ధర తగ్గించాలని ఆయన వ్యాక్సిన్‌ తయారీ సంస్థలను కూడా కోరారు. ఇది మానవాళికి సహాయం చేయాల్సిన సమయమని.. ఈ సమయంలో లాభాపేక్ష ఉండకూడదని కేజ్రీవాల్‌ అన్నారు.

500 పడకల ఆస్పత్రి..

ITBP-run Sardar Patel Covid Care
సర్దార్​ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్​ను సందర్శించిన కేజ్రీవాల్

దిల్లీలోని ఇండో-టిబెటన్​ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ) ఆధ్వర్యంలోని సర్దార్​ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్​ సోమవారం ప్రారంభమైంది. ఛతార్​పుర్​లో ఉన్న ఈ ఆస్పత్రిని సీఎం కేజ్రీవాల్ సందర్శించారు.

ITBP-run Sardar Patel Covid Care
ఐటీబీపీ ఆధ్వర్యంలోని కొవిడ్ ఆస్పత్రి

ఈ సెంటర్​లో 500 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని, త్వరలోనే మరో 200 ఐసీయూ పడకలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ITBP-run Sardar Patel Covid Care
చికిత్స కోసం వస్తోన్న రోగులు

ఆస్పత్రికి వైద్యులు, సిబ్బందికి అందించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు కేజ్రీవాల్ తెలిపారు.

ITBP-run Sardar Patel Covid Care
పరీక్షలు చేస్తోన్న సిబ్బంది

'టెస్టింగ్ సెంటర్లు పెంచాలి'

దేశ రాజధానిలో మరిన్ని కొవిడ్ నిర్ధరణ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆప్​ సర్కారను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో రోజుకు దాదాపు 24వేల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నమూనాల సేకరణ కోసం మౌలిక సదుపాయాలను పెంచాలని పేర్కొంది.

ఇదీ చూడండి: ఉచిత వ్యాక్సిన్‌కు 17 రాష్ట్రాల సంసిద్ధత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.