ETV Bharat / bharat

నాలుగేళ్ల చిన్నారి.. ప్రతిభకు సాటేది!

author img

By

Published : Mar 7, 2021, 10:50 AM IST

వివిధ కళల్లో నైపుణ్యం సంపాదించేందుకు వయసు అడ్డురాదని రుజువుచేస్తోంది కర్ణాటకకు చెందిన నాలుగేళ్ల చిన్నారి. తన ప్రతిభతో ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లోకెక్కింది.

Four year old girl from Athani get the place in India Book of Records
ప్రతిభకు వయసు అడ్డుకాదంటున్న నాలుగేళ్ల చిన్నారి
నాలుగేళ్ల చిన్నారి అరుదైన ప్రతిభ

నాలుగేళ్ల వయసులో చిన్నారులు చిట్టి పొట్టి మాటలు మాట్లాడుతుంటేనే తల్లితండ్రులు తెగ మురిసిపోతుంటారు. అలాంటిది.. అన్ని కళల్లో ప్రతిభ చూపే నైపుణ్యం సంపాదించే పనిలో పిల్లలుంటే? ఆ తల్లితండ్రుల ఆనందానికి అవధులుండవు కదూ! కర్ణాటకలోని ఓ దంపతులకు ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. ఇంతకి ఎవరు ఆ చిన్నారి? ఆమె ప్రతిభ ఏంటి?

కాదేదీ ప్రతిభకు అనర్హం..

కర్ణాటక అథని తాలూకులోని బెల్గాంకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శ్రావ్య సదాశివ చిక్కట్టి.. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మ్యాప్​ చూస్తు ప్రపంచదేశాల పేర్లను గడగడా చదివేయడం, పెయింటింగ్​, పాటలు పాడటం, భరతనాట్యం మొదలైనవి ఈ చిన్నారికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు.

Four year old girl from Athani get the place in India Book of Records
శ్రావ్య చిక్కట్టి

వీటితోపాటు కరాటే, యోగ, వీణ వాయించడంపైనా దృష్టి పెట్టిందీ నాలుగేళ్ల చిన్నారి. ఈ చిన్నారి ప్రతిభకు ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు లభించింది. 2020లో శ్రావ్యకు ఈ అవార్డు వచ్చిందని చిన్నారి తల్లితండ్రులు పేర్కొన్నారు.

శ్రావ్య తల్లి కోమల్​ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ సమయంలో తన కూతురిలో అన్ని నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేసినట్లు ఆమె తెలిపారు. శ్రావ్య ప్రతిభను పలువురు ప్రశంసించడం ఆనందంగా ఉందని చిన్నారి తండ్రి సదాశివ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:బిడ్డను ఎత్తుకుని విధుల్లో మహిళా కానిస్టేబుల్​​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.