జమ్ముకశ్మీర్ అనంతనాగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహించాయి. జిల్లాలోని షాల్గుల్ అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. భద్రతా దళాలు వారిని మట్టుబెట్టాయి.
ఎన్కౌంటర్ నేపథ్యంలో అనంతనాగ్ జిల్లాలో అంతర్జాలంపై నిషేధం విధించారు. మరో ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు ఎన్కౌంటర్ ప్రాంతంలో చిక్కుకున్నారని సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 19న బడిగాం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తొయిబా అనుచరులను హతమార్చాయి భద్రతా దళాలు.