ETV Bharat / bharat

Drones: జమ్ముకశ్మీర్​లో మళ్లీ డ్రోన్ల కలకలం

జమ్ముకశ్మీర్​లో ఆదివారం అర్ధరాత్రి నాలుగు చోట్ల అనుమానిత డ్రోన్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఒకటి పోలీసు స్టేషన్​కు సమీపంలో.. మరొకటి ఓ వంతెన వద్ద గుర్తించగా.. మరో రెండు వేర్వేరు ప్రాంతాల్లో కనిపించినట్లు పేర్కొన్నారు.

Four suspected drones spotted
నాలుగు ప్రదేశాల్లో డ్రోన్ల కలకలం
author img

By

Published : Aug 2, 2021, 9:30 AM IST

జమ్ముకశ్మీర్​లో మరోసారి డ్రోన్లు కలకలం రేపాయి. సాంబా జిల్లాలోని బారి బ్రాహ్మణ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి నాలుగు చోట్ల అనుమాస్పద స్థితిలో డ్రోన్లు కదిలినట్లు జిల్లా సీనియర్​ పోలీసు అధికారి తెలిపారు. ఓ డ్రోన్​ పోలీసు స్టేషన్​కు సమీపంలో కదిలాడగా.. మరొకటి బలాల్ వంతెన వద్ద గమనించినట్లు పేర్కొన్నారు. అలాగే మరో రెండు ఇతర ప్రాంతాలకు సమీపంలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

అంతకుముందు జూన్​ 30న.. పాకిస్థాన్​కు చెందినట్లు భావిస్తున్న​ డ్రోన్లు​.. సాంబా జిల్లాలో మూడు వేర్వేరు ప్రదేశాలలో సంచరించినట్లు గుర్తించారు. బారి-బ్రాహ్మణ, చిలద్య గగ్వాల్ ప్రాంతాల్లో రాత్రి 8.30 గంటల సమయంలో ఎగురుతున్న డ్రోన్ల​ను అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: భారత్-చైనాల మధ్య 'హాట్‌లైన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.