ఝార్ఖండ్‌లోని గిరిడీ జిల్లా టిస్రి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగిన పేలుడు.. ఒకే కుటుంబంలోని నలుగురిని పొట్టనబెట్టుకుంది. పేలుడు తీవ్రతకు ఓ ఇల్లు నేలమట్టమైంది. శిథిలాల కింద నుంచి ఒకరిని రక్షించారు.
ఘటనకు గల కారణాలను ఇంకా గుర్తించలేదని జిల్లా ఎస్పీ అమిత్ రేణు తెలిపారు. సిలిండర్ పేలి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు చెప్పారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
శనివారం రాత్రి 9.30 గంటలకు బుధాన్ రాయ్ అనే స్థానికుడి ఇంట్లో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో తన భార్య, కోడలు, మనవడు, రెండు నెలల పసిపాప నిద్రిస్తున్నారని బుధాన్ రాయ్ తెలిపారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు తిరుగుబాణమైన రాసలీలల సీడీ