ETV Bharat / bharat

ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. ఆత్మహత్యా? లేక... - రాజస్థాన్​ వార్తలు

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగతజీవులుగా కనిపించడం కలకలం సృష్టించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, రాజస్థాన్​లో ఓ నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన మైనర్​ బాలుడుతోపాటు యువకుడ్ని పోలీసులు అరెస్ట్​ చేశారు.

suicide
suicide
author img

By

Published : Jul 23, 2022, 7:51 AM IST

మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగతజీవులుగా కనిపించారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

"మహరాజ్​పురాలోని నివాసం ఉంటున్న జితేంద్ర వాల్మీకీతో పాటు అతడి నాలుగేళ్ల కుమారుడి మృతదేహాలు ఇంట్లో వేలాడుతూ కనిపించాయి. జితేంద్ర భార్య నిర్మలతో కుమార్తె జాన్వీ మృతదేహలు నేలపై పడి ఉన్నాయి.''

--రవి భడోరియా, సీఎస్​పీ

జితేంద్ర ముందుగా.. తన భార్య, కుమార్తెకు విషమిచ్చి, కుమారుడికి ఉరివేసి ఉంటాడని, ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. "జితేంద్ర ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నాడు. కుటుంబం గ్వాలియర్‌లోని మురార్ ప్రాంతంలో ఉంటుంది. అయితే ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు." అని సీఎస్​పీ తెలిపారు.

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం..ఇద్దరు అరెస్టు..
రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపుర్ జిల్లాలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ మైనర్​ బాలుడ్ని, యువకుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలల క్రితం మైనర్ బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని మహిళా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ చంచల్ శర్మ పేర్కొన్నారు. అదే బాలికపై గురువారం రాత్రి ఓ 22 ఏళ్ల యువకుడు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడని, నిందితుడిని అరెస్టు చేసినట్లు శర్మ తెలిపారు. నిందితులిద్దరూ బాధితురాలి ఇంటికి సమీపంలోనే నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి: ఆటోపై పడిన లారీ.. ఏడుగురు దుర్మరణం.. నలుగురికి తీవ్ర గాయాలు

ప్రియురాలి తల నరికి.. స్టేషన్​కు తీసుకెళ్లిన యువకుడు.. అందుకు ఒప్పుకోలేదనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.