ETV Bharat / bharat

గనిలో చిక్కుకున్న కూలీలు- 96 గంటలు నాన్​స్టాప్​గా తవ్వి బయటకు!

Bokaro Mine: ఓ బొగ్గు గనిలో చిక్కుకున్న నలుగురు కార్మికులు 96 గంటల పాటు నిర్విరామంగా తవ్వి ప్రాణాలను కాపాడుకున్నారు. ఎన్డీఆర్​ఎఫ్​, పోలీసులు సాయం అందించలేకపోయినా వారే స్వయంగా గని నుంచి బయటపడ్డారు. ఝార్ఖండ్​ బొకారో బొగ్గు గనిలో ఈ ఘటన జరిగింది.

Bokaro mine, గని కార్మికులు
96 గంటలు తవ్వి ప్రాణాలతో బయటపడ్డ కార్మికులు
author img

By

Published : Nov 30, 2021, 5:39 PM IST

Updated : Nov 30, 2021, 5:46 PM IST

Bokaro Mine: ఝార్ఖండ్ బొకారోలోని బొగ్గు గనిలో చిక్కుకున్న నలుగురు కార్మికులు నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్డీఆర్​ఎఫ్​, పోలీసులు వారికి సాయం చేయలేకపోయినా 96 గంటల పాటు తవ్వుకుంటూ గని నుంచి బయటకు వచ్చారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

Bokaro mine, గని కార్మికులు
96 గంటలు తవ్వి ప్రాణాలతో బయటపడ్డ కార్మికులు

బొకారో గనిలోని పర్వత్​పుర్​ బ్లాక్​లో పనిచేసే నలుగురు కార్మికులు శ్రవణ్ రజ్వార్​, లక్ష్మణ్ రజ్వార్​, అనాడి సింగ్, భరత్​ సింగ్ నవంబర్​ 26న గనిలో ప్రమాదం జరిగినప్పుడు తప్పిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న మరికొంతమంది కార్మికులను స్థానికులు కాపాడారు. పోలీసులు నవంబర్​ 27న ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్​ఎఫ్ సిబ్బంది కూడా ఆ మరునాడు రంగంలోకి దిగారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ నలుగురిని బయటకు తీసుకురాలేకపోయారు.

అయితే వీరు మాత్రం జీవితంపై ఆశలు వదులుకోలేదు. తవ వద్ద ఉన్న పార, గునపాలతో తవ్వడం ప్రారంభించారు. అలా 96 గంటల పాటు నిర్విరామంగా తవ్వి గని నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. తమ నలుగురి వద్ద టార్చి లైట్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ఒక టార్చిని ఉపయోగిస్తున్నప్పుడు మిగతా వాటిని వాడలేదని కార్మికులు చెప్పారు. నాలుగు రోజుల పాటు కేవలం నీళ్లు తాగినట్లు వెల్లడించారు. గని నుంచి బయటపడ్డ వీరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది వెళ్లారు. కానీ ఆస్పత్రికి వెళ్లేందుకు వారు నిరాకరించారు.

ఈ ఘటనపై శ్రవణ్ రజ్వార్ భార్య మీరా దేవి స్పందించింది. గనిలో చిక్కుకున్న తర్వాత తన భర్త గొంతు విన్నానని, తాను బిగ్గరగా పిలిచినప్పుడు అతను స్పందించాడని చెప్పింది. గనిలో చిక్కుకున్న ఈ నలుగురు సాయం కోసం చేసిన ఆర్తనాథాలు తమకు వినిపించాయని మరో బంధువు తెలిపాడు. వాళ్లకు సాయం చేసేందుకు స్థానికులు శాయశక్తులా కృషి చేశారని, కానీ బయటకు తీసుకురావడంలో సఫలం కాలేక పోయారని వివరించారు.

బొకారోలోని పర్వత్​పుర్​ బ్లాక్​లో చాలా కాలంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఎవరూ పట్టించుకోకపోవడం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి: సర్జరీ విఫలం.. 25 మంది కంటి చూపు కోల్పోయే ప్రమాదం!

Last Updated : Nov 30, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.