ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. మంగళవారం సాయంత్రం నుంచి ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు లఖ్‌నవూలోని సంజయ్ గాంధీ పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించింది. ఊపిరి తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు తలెత్తాయని తెలిపింది. కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ వైద్యనిపుణులు ఆయన్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని వివరించింది.

ఇన్ఫెక్షన్ కారణంగా జులై 4న ఆస్పత్రి ఐసీయులో చేరారు కల్యాణ్ సింగ్. అంతకుముందు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందారు.
మోదీ, యోగి ప్రత్యేక శ్రద్ధ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఆదివారం ఆస్పత్రిని సందర్శించిన యోగి.. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

89 ఏళ్ల సింగ్.. రాజస్థాన్ గవర్నర్‌గానూ పనిచేశారు. బాబ్రీ మసీదు ఘటన సమయంలో కల్యాణ్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఇదీ చదవండి: సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులోనే రోగికి చికిత్స