తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ దినేశ్ త్రివేది.. భాజపాలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బంగాల్లో జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ బడ్జెట్ తొలి దఫా సమావేశాల్లో రాజ్యసభ వేదికగానే తన రాజీనామా ప్రకటన చేశారు త్రివేది.
![Former TMC MP Dinesh Trivedi joins BJP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10894857_evxx2hlu8aigzct-1.jpg)
కొన్ని పార్టీల్లో కుటుంబాలకే ప్రాధాన్యం ఉందని, కానీ భాజపాలో ప్రజలకే అత్యున్నత స్థానమని చెప్పారు త్రివేది. ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. కరోనా సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు స్వాగతించదగినదని అన్నారు.
![Former TMC MP Dinesh Trivedi joins BJP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10894857_evxx2hlu8aigzct-2.jpg)
మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా త్రివేదికి పేరుంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే మంత్రి పదవికీ ఆయన్ను సిఫార్సు చేశారు దీదీ. 2019లో లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. రాజ్యసభకు పంపించారు.
![Former TMC MP Dinesh Trivedi joins BJP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10894857_evxx2hlu8aigzct-3.jpg)
ఇదీ చదవండి: ప్రభుత్వం రైతులను వేధిస్తోంది: రాహుల్