ETV Bharat / bharat

పంజాబ్​లో ఇమ్రాన్ ఖాన్​ బ్యానర్​ కలకలం.. ఏం జరిగింది? - పంజాబ్ బఠిండా లేటెస్ట్ న్యూస్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఫొటో ఉన్న ఓ బ్యానర్ పంజాబ్​లో​ కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాలికి ఎగిరి ఈ బ్యానర్​ పాకిస్థాన్ నుంచి పంజాబ్​లో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

imran khan banner in Punjab
పంజాబ్​లో ఇమ్రాన్ ఖాన్ బ్యానర్
author img

By

Published : Oct 30, 2022, 12:52 PM IST

పంజాబ్​ బఠిండాలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ ఫొటో ఉన్న ఓ బ్యానర్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న దయాల్‌పురా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బ్యానర్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యానర్‌కు బెలూన్లు కట్టి గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇటీవలే పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​.. ఇస్లామాబాద్​లో ర్యాలీ నిర్వహించారు. ఈ బ్యానర్​ ఆ ర్యాలీలోనిదని పోలీసులు భావిస్తున్నారు.

imran khan banner in Punjab
వ్యవసాయ క్షేత్రంలో ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఉన్న బ్యానర్

"పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ సమయంలో ఆయన అభిమానులు ఈ బ్యానర్​కు బెలూన్లు కట్టి గాలిలో ఎగరేసి ఉండవచ్చు. గాలి వల్ల పాక్​ నుంచి ఈ బెలూన్​ భారత్ వైపు దూసుకొచ్చి పంట పొలంలో పడిపోయి ఉండవచ్చని భావిస్తున్నాం. బ్యానర్​పై భారత్​కు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు లేవు. బ్యానర్‌ను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం."
-పోలీసులు

imran khan banner in Punjab
పంజాబ్​లో ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఉన్న బ్యానర్

ఇవీ చదవండి: ఉచితంగా వైద్యం... రూ.50కే ఆపరేషన్​.. సంస్థ బంపర్ ఆఫర్!

కుమార్తెను ప్రేమించాడని సుపారీ ఇచ్చి హత్య.. 33 రోజుల తర్వాత..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.