ETV Bharat / bharat

వివాదాస్పదంగా మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహం! - మాజీ ఎమ్మెల్యే కూతురి వివాహం

కరోనా విపత్కర పరిస్థితుల్లో అతి తక్కువ మందితో, నిరాడంభరంగా శుభకార్యాలు, వివాహాలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఏఐడీఎంకే నేత కుమార్తె వివాహం విలాసవంతంగా జరగటం చర్చనీయాంశంగా మారింది. కట్నం కింది ఇచ్చిన సుమారు రూ.2 కోట్ల విలువైన వస్తువుల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Former MLA's daughter wedding
మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహం
author img

By

Published : Nov 7, 2020, 3:52 PM IST

కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభంతో భారత్​ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లాక్​డౌన్​ కారణంగా అనేక వర్గాలపై తీవ్ర ప్రభావం పడింది. వైరస్​ బారిన పడకుండా భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితి తెలెత్తింది. ఈ విపత్కర పరిస్థితిలో ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహం విలాసవంతంగా, భారీ ఎత్తున జరగడం వివాదాస్పదంగా మారింది.

తమిళనాడు మదురైలో ఏఐఏడీఎంకే నేత, మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహం జరిగింది. పెళ్లి జరిగిన భవనంలోని ఒక పెద్ద గది మొత్తం ప్లాస్టిక్​, వెండి, బంగారు పాత్రలు, టీవీలు, మిక్సర్లు, గ్రైండర్లు, ఎలక్ట్రానిక్​ వస్తువులు సహా కొత్త వాహనాలు ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి కానుకగా ట్రాక్టర్లు ఇవ్వడం గమనార్హం.

Former MLA's daughter wedding
గదిలో ఉంచిన వస్తువులు

ఫొటోలను పరిశీలిస్తే.. అందులోని వస్తువులు, వాహనాలు పెళ్లికుమార్తెకు వివాహ లాంఛనాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెళ్లికి వచ్చిన వారితో పాటు, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను చూసిన వారు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Former MLA's daughter wedding
వైరల్​గా మారిన చిత్రం

ఇదీ చూడండి: ఓటర్ల సంకల్పం- ఓటేయడం కోసం బ్రిడ్జి నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.