మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బుధవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా 10 గంటలకు డీఆర్డీఓ అతిథి గృహానికి చేరుకున్నారు.
ముంబయి పోలీస్ మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్, మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే.. దేశ్‌ముఖ్‌పై చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది.
దేశ్‌ముఖ్ వద్ద వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్న ఇద్దరిని సీబీఐ ఇప్పటికే విచారించింది. అలాగే.. పరమ్‌బీర్ సింగ్, సచిన్ వాజే స్టేట్మెంట్లను రికార్డు చేసింది.
ఇదీ చదవండి : కరోనాతో కఠిన ఆంక్షల దిశగా పలు రాష్ట్రాలు