భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయికి మాతృ వియోగం కలిగింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తల్లి శాంతి గొగొయి కన్ను మూశారు.

అసోం మాజీ ముఖ్యమంత్రి కేశవ్ చంద్ర భార్య అయిన శాంతి గొగొయి.. కొన్నిరోజులుగా కంటి శస్త్రచికిత్స నిమిత్తం దిల్లీలో చికిత్స పొందుతున్నారు. గుండె సంబంధిత సమస్యలతోనూ ఆమె బాధపడుతున్నారు. గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించగా.. ఆమె తుదిశ్వాస విడిచారు.