బంగాల్ మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష సీనియర్ నేత బుద్దదేవ్ భట్టాచార్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
"ఆయనకు చికిత్స అందిస్తున్నాం. అత్యవసర పరీక్షలు జరుపుతాం. అనంతరం వచ్చిన ఫలితాలు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆధారంగా తదుపరి వైద్యం చేస్తాం."
- ఆసుపత్రి వర్గాలు
గతంలోనూ ఇదే సమస్యతో ఆసుపత్రిలో చేరిన బుద్దదేవ్.. కొద్ది రోజులకు కోలుకున్నారు. అయితే మళ్లీ శ్వాస సంబంధిత సమస్య సహా వయసు రీత్యా కొన్ని ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
భట్టాచార్య.. 2000 నుంచి 2011 వరకు బంగాల్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.
ఇదీ చూడండి: కేర్టేకర్పై మోసం కేసు పెట్టిన సీజేఐ తల్లి