ETV Bharat / bharat

కశ్మీర్​లో విదేశీ రాయబారుల పర్యటన - జమ్ముకశ్మీర్​

24 దేశాలకు చెందిన రాయబారులు జమ్ముకశ్మీర్​కు చేరుకున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి ఆర్టికల్​ 370 రద్దు అనంతర పరిస్థితులను తెలుసుకోనున్నారు.

Foreign delegation in Jammu and Kashmir on a 2-day visit
జమ్ముకశ్మీర్​లో విదేశీరాయబారుల 2రోజుల పర్యటన
author img

By

Published : Feb 17, 2021, 11:18 AM IST

Updated : Feb 17, 2021, 12:42 PM IST

కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్​లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి 24 దేశాలకు చెందిన రాయబారులు శ్రీనగర్​కు వచ్చారు. రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 17, 18) జమ్మకశ్మీర్​లో పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారు.

తొలుత రాయబారులకు అక్కడి ప్రజలు సంప్రదాయ కశ్మీరీ నృత్యాలు, పాటలతో స్వాగతం పలికారు. అధికారులు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. అనంతరం లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హాతో పాటు ఇతర అధికారులు, రాజకీయ నాయకులతో భేటీ కానున్నారు.

Foreign delegation in Jammu and Kashmir on a 2-day visit
జమ్ముకశ్మీర్​లో విదేశీరాయబారులు

శ్రీనగర్​ చేరుకున్న విదేశీ రాయబారులు

స్వాగతం పలుకుతున్న మహిళలు

విందులో పాల్గొన్న రాయబారులు

బడ్​గామ్​ జిల్లాలోని మాగామ్​ బ్లాక్​లోని ప్రజలతో ఫ్రాన్స్​ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్​, ఇటలీ రాయబారి విన్సెంజో డీ లూసా.. ముచ్చటించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

బడ్​గామ్​లో ప్రజలతో రాయబారులు

ప్రజలతో మాట్లాడుతున్న రాయబారులు

జమ్ముకశ్మీర్​కు వచ్చిన వారిలో ఫిన్​లాండ్​, ఫ్రాన్స్​, స్వీడన్​, స్పెయిన్​, పోర్చుగల్ సహా మరికొన్ని ఐరోపా దేశాల రాయబారులు ఉన్నారు.

జమ్ముకశ్మీర్​లో డీడీసీ ఎన్నికలు జరిగాక విదేశీ రాయబారులు రావడం ఇదే తొలిసారి. రాష్టానికి ప్రత్యేక హోదా రద్దు తర్వాత మూడోసారి.

ఇదీ చూడండి: 'జమ్ముకశ్మీర్​కు సరైన సమయంలో రాష్ట్ర హోదా'

Last Updated : Feb 17, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.