ETV Bharat / bharat

పెళ్లైన మూడో రోజుకే యువతి ఆత్మహత్య- అమ్మానాన్న అలా చేశారని... - వెల్లూరు జిల్లా వార్తలు

తమిళనాడులోని వెల్లూరులో ఈనెల 17న జరిగిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ నవ వధువు బలవంతంగా తనకు పెళ్లి చేశారన్న కారణంతో ఆత్మహత్య చేసుకుంది.

tamil nadu news latest today
పెళ్లైన మూడో రోజుకే యువతి ఆత్మహత్య
author img

By

Published : Nov 19, 2021, 5:57 PM IST

పెళ్లి జరిగిన మూడో రోజుకే ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా బలవంతంగా వివాహం జరిపించడమే ఆమె ఆత్మహత్యకు కారణమని తేలింది.

ఇష్టం లేకపోయినా..

వెల్లూరులోని ముత్తుమండపం ప్రాంతానికి చెందిన (21) ఏళ్ల భువనేశ్వరి నర్సింగ్​ మూడో సంవత్సరం చదువుతోంది. ఈనెల 15న ఆమెకు రాణిపెట్టాయ్​ జిల్లా కావేరిపక్కంకు చెందిన మణికందన్​తో వివాహమైంది. ఈ నేపథ్యంలో బుధవారం యువతి ఆమె ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

tamil nadu news latest today
ఆత్మహత్య చేసుకున్న యువతి

వెల్లూరు జిల్లా మెజిస్ట్రేట్​ జరిపిన విచారణలో తమ కుమార్తెకు బలవంతంగా పెళ్లి చేశామని, ఆమెకు ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం చేసుకోవాలని ఉండేదని తల్లిదండ్రులు వెల్లడించారు. గత ఐదు నెలల్లో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి పెళ్లి మధ్య.. వరుడు మణికందన్​తో భువనేశ్వరి మూడు సార్లు మాత్రమే మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ ఆత్మహత్య వెనుక కారణం బలవంతపు వివాహమా లేక మరేదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి : 'సాగు చట్టాలు మంచివే.. ఆ విషయం చెప్పడంలోనే మేము విఫలం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.