ETV Bharat / bharat

స్కూళ్లు తెరవాలని మైనర్ పిటిషన్- షాకిచ్చిన సుప్రీం - supreme court on school reopen

దేశంలోని పాఠశాలలను తెరవాలంటూ (Schools reopening) ఓ మైనర్ దాఖలు చేసిన పిటిషన్​ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యాంగ పరిష్కారాలపై కాకుండా చదువుపై దృష్టిపెట్టాలని పిటిషనర్​కు సూచించింది. ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని (Supreme Court on school reopen) స్పష్టం చేసింది.

sc minor
సుప్రీంకోర్టు
author img

By

Published : Sep 20, 2021, 8:32 PM IST

దేశవ్యాప్తంగా పాఠశాలలను భౌతికంగా (Schools reopening) పునఃప్రారంభించాలని వ్యాజ్యం దాఖలు చేసిన 17 ఏళ్ల విద్యార్థికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. రాజ్యాంగ పరిష్కారాలను వెతకడానికి బదులుగా చదువుపై దృష్టిసారించాలని సూచించింది. పిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించే విషయంపై ప్రభుత్వాలన్నీ ఆందోళనతోనే ఉన్నాయని పేర్కొంది. (Supreme Court on school reopen) దేశం ఇప్పుడిప్పుడే కరోనా రెండో దశ ఉద్ధృతి నుంచి కోలుకుందని.. ఈ నేపథ్యంలో పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది(school reopen supreme court).

విద్యార్థి పిటిషన్​ను పబ్లిసిటీ గిమ్మిక్కుగా భావించడం లేదని పేర్కొంది ధర్మాసనం. (school reopen supreme court) అయితే, పిల్లలు ఈ విషయాల్లో కలుగజేసుకోకూడదని అభిప్రాయం వ్యక్తం చేసింది. దిల్లీకి చెందిన విద్యార్థి పిటిషన్​ను స్వీకరించడానికి.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

"రాజ్యాంగ పరిష్కారాల విషయంలో కలుగజేసుకోవద్దని, చదువుకోవడంపై దృష్టిసారించమని మీ(పిటిషనర్ న్యాయవాదిని ఉద్దేశించి) క్లైంట్​కు చెప్పండి. ఈ పిటిషన్​కు తప్పుగా దాఖలు చేసిన విషయాన్ని గమనించారా? కేరళ, మహారాష్ట్రలో ఉన్న పరిస్థితులు దిల్లీలో ఉన్న పరిస్థితులు వేరు. కరోనా రెండో వేవ్ నుంచి దేశం ఇప్పుడే బయటపడింది. ముప్పు ఇంకా ముగియలేదు. మరో వేవ్ వస్తుందనో, లేదా తీవ్రత అదే స్థాయిలో ఉంటుందనో మేం చెప్పడం లేదు. వ్యాక్సినేషన్ జరుగుతోంది. కానీ పిల్లలకు ఇప్పుడే ఇవ్వడం లేదు. పిల్లలందరూ స్కూళ్లకు వెళ్లాలని మేం చెప్పలేం. ప్రభుత్వాలకు అనేక సమస్యలు ఉన్నాయి."

-సుప్రీంకోర్టు

పాలనాయంత్రాంగంలో ఉన్న సంక్లిష్టతల వల్ల (school reopen supreme court) ఆదేశాలు ఇవ్వలేకపోతున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. కొన్ని విషయాలు దేశం అవలంబిస్తున్న ప్రజాస్వామ్య జీవనవిధానానికే వదిలేయాలని అభిప్రాయపడింది. ప్రభుత్వాలన్నీ పిల్లల్ని స్కూల్​కు పంపాలనే కోరుకుంటాయని తెలిపింది. (Supreme Court on school reopen) కర్ణాటక, దిల్లీలో పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారని వివరించింది.

"స్కూల్​కి వెళ్లి సీనియర్ విద్యార్థులతో కలిసి చదువుకోవాలని పిల్లలకు మేం చెప్పలేము. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఒక్కో రాష్ట్రంలో జనాభా ఒక్కోలా ఉంటుంది. జనసాంద్రత వేరుగా ఉంటుంది. ఎన్నో సమస్యలు దీనికి ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు."

-సుప్రీంకోర్టు

ఈ నేపథ్యంలో పిటిషన్​ను ఉపసంహరించుకోవాలని సూచించింది ధర్మాసనం. (Supreme Court on school reopen) ఇందుకు పిటిషనర్ తరపు న్యాయవాది రవి ప్రకార్ మెహ్రోత్ర అంగీకరించారు. ఈయన పిటిషనర్ తండ్రే కావడం గమనార్హం.

ఇదీ చదవండి: పాక్​కు సైనిక స్థావరాల సమాచారం.. గూఢచారి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.