ఐఫోన్ కొనడం చాలా మంది మధ్య తరగతి వ్యక్తులకు ఓ కల. అలాంటిది ఖరీదైన యాపిల్ ఫోన్‌ను ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే.. తీరా అది వచ్చాక అందులో ఐఫోన్ లేకపోతే..? ఇలాంటి అనుభవమే సిమ్రన్‌పాల్ సింగ్ అనే వ్యక్తికి ఎదురైంది. (Flipkart wrong product delivered)
బిగ్ బిలియన్ డేస్ (Flipkart big billion days) ఆఫర్లో భాగంగా రూ.53 వేలు విలువ చేసే యాపిల్ ఐఫోన్ 12ను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశారు సిమ్రన్‌పాల్. కానీ తీరా వచ్చాక చూస్తే అందులో ఐఫోన్ (Apple iPhone 12) లేదు. పార్సిల్లో రెండు నిర్మా సబ్బులు (Nirma Washing soap) వచ్చాయి. యూట్యూబ్‌లో వీడియో అప్లోడ్ చేసి తన అనుభవాన్ని వివరించారు సిమ్రన్‌పాల్.
దీనిపై ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌ను సంప్రదించగా.. కొన్ని రోజుల తర్వాత సిమ్రన్‌పాల్ ఆర్డర్‌ను సంస్థ రద్దు చేసింది. పొరపాటు వల్ల అలా జరిగిందని గుర్తించింది. ఆర్డర్‌ను రద్దు చేసి ఐఫోన్ కోసం చెల్లించిన నగదును కస్టమర్‌కు రీఫండ్ చేసింది.
ఇదీ చదవండి: