ETV Bharat / bharat

Mumbai Flight Crash : వైజాగ్​ నుంచి వెళ్లిన ప్రైవేట్​ విమానం క్రాష్​.. భారీ వర్షంలో ల్యాండ్ అవుతూ..

Mumbai Flight Crash : విశాఖపట్నం నుంచి ముంబయి వెళ్లిన ఓ విమానం.. ల్యాండ్​ అవుతున్న సమయంలో రన్​వేపై క్రాష్​ అయింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులతోపాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారు.

Mumbai Flight Crash
Mumbai Flight Crash
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 6:21 PM IST

Updated : Sep 14, 2023, 7:48 PM IST

Mumbai Flight Crash : ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం నుంచి వెళ్లిన ఓ విమానం.. మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయంలో భారీ ప్రమాదానికి గురైంది. ప్రైవేటు సంస్థకు చెందిన ఆ చిన్న విమానం రన్​వేపై అదుపు తప్పి.. పక్కకు దూసుకెళ్లి క్రాష్​ అవగా ఎనిమిది మంది గాయపడ్డారు. ఘటన సమయంలో భారీ వర్షం కురుస్తోందని డీజీసీఏ అధికారులు వెల్లడించారు. విమానంలో ఆరుగురు ప్రయాణికులతోపాటు ఇద్దరు సిబ్బంది ఉండగా.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై మంటలు చెలరేగకుండా చర్యలు చేపట్టారు.

Mumbai Flight Crash
రన్​వేపై విమానం క్రాష్​
Flight Skids Off Runway
విమానం వద్ద సహాయక చర్యలు

విమానంలో ఉన్న అందరికీ గాయాలు..
Flight Crash At Mumbai Airport : ప్రమాదానికి గురైన విమానాన్ని VSR వెంచర్స్​కు చెందిన లీర్‌జెట్ 45 VT-DBLగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న వారంతా గాయపడ్డారని.. చికిత్స కోసం వారిని ఆస్పత్రి తరలించినట్లు బృహన్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్ (బీఎంసీ)​ తెలిపింది. గురువారం సాయంత్రం ఐదు గంటలో ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది.

  • 3 injured hospitalised after VSR Ventures Learjet 45 aircraft VT-DBL operating flight from Visakhapatnam to Mumbai was involved in runway excursion (veer off) while landing on runway 27 at Mumbai airport: BMC

    — ANI (@ANI) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Aircraft Crash Mumbai : "సెప్టెంబరు 14వ తేదీన.. VSR వెంచర్స్​కు చెందిన లీర్‌జెట్ 45 VT-DBL విమానం ముంబయి ఎయిర్​పోర్ట్​ రన్​వే 27పై ల్యాండ్​ అవుతుండగా ప్రమాదానికి గురైంది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది. ఘటన తర్వాత ఎయిర్​పోర్ట్​లోని రెండు రన్​వేలు కొన్ని గంటలపాటు మూసివేశాం. ఆ తర్వాత యథావిథిగా విమాన రాకపోకలు జరుగుతున్నాయి" అని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

కొద్ది రోజుల క్రితం, మలేసియా రాజధాని కౌలాలంపుర్​లో చార్టర్​ విమానం అదుపుతప్పి కూలిన ఘటనలో 10 మంది మరణించారు. లంకావి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుల్తాన్​ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఎక్స్​ప్రెస్​ వేపై కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది మృతి చెందారని అధికారులు చెప్పారు. ఈ విమానం ఎక్స్​ప్రెస్ వేపై కూలడం వల్ల కారుతో పాటు బైక్​ను ఢీ కొట్టిందని.. దీంతో మరో ఇద్దరు మరణించారని తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

కుప్పకూలిన రెండు హెలికాప్టర్‌లు.. 9 మంది సైనికులు దుర్మరణం!

హ్యాంగర్​పైకి దూసుకెళ్లిన విమానం.. ఐదుగురు మృతి.. 8 మందికి గాయాలు

Last Updated : Sep 14, 2023, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.