Flight Emergency Landing in Varanasi: ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వారణాసి నుంచి ముంబయికి వెళ్తున్న విస్తారా యూకే 622 విమానం ఓ పక్షిని ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం విమానాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. రన్‌వేపై పూర్తిగా తనిఖీలు చేశామని పక్షికి సంబంధించిన అవశేషాలు లభించలేదని డైరెక్టర్ ఆర్యమ సన్యాల్ తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు.
"విస్తారా యూకే 622 విమానం సాయత్రం 4:11 గంటలకు వారణాసి నుంచి ముంబయికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం పక్షిని ఢీకొట్టిందని పైలట్ సమాచారం ఇచ్చాడు. ఏటీసీని సంప్రదించి ల్యాండింగ్ అనుమతిని కోరాడు. సాయంత్రం 4:40గంటలకు వారణాసిలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది."
- ఆర్యమ సన్యాల్, వారణాసి విమానాశ్రయ డైరెక్టర్
ఇవీ చదవండి: 60 గోమాతలు మృతి.. ఘటనపై యోగి సీరియస్!
నాలుగో అంతస్తు నుంచి కూతుర్ని తోసేసిన తల్లి.. 40 అడుగుల బావిలో నవజాత శిశువు