ముంబయికు చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు నాందేడ్ జిల్లాలో 1,127 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.5.63 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మత్తుపదార్థాలను తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు.
నిందితులు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి గంజాయి తరలిస్తుండగా రైడ్ చేసి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. మంజ్రామ్లోని నాయిగావ్ తాలూకాలో పట్టుబడిన ఈ గంజాయిని బలగావ్ జిల్లాలో డెలివరీ చేసేందుకు నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు ముంబయి ఎన్సీబీ బృందం పట్టుకున్న గంజాయిలో ఇదే పెద్ద మొత్తమని అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: drugs seize: రూ.600 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత