ETV Bharat / bharat

బాలికపై సామూహిక అత్యాచారం- వీడియో చిత్రీకరించి బెదిరింపు - మైనర్​పై సామూహిక అత్యాచారం

Gang rape minor girl: అసోంలో ఐదురుగు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఓ చిన్నారిపై సామూహిక అత్యాచారం చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం వెతుకుతున్నారు.

Gang rape
బాలికపై అత్యాచారం
author img

By

Published : Mar 11, 2022, 5:00 PM IST

Gang rape minor girl: అసోం రాజధాని గువహటిలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఐదుగురు యువకులు ఆ చిన్నారిని ఓ గదిలో బంధించి.. ఈ ఆకృత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అత్యాచారం చేసేటప్పుడు వీడియో కూడా తీశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తామని బెదిరించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ జరిగింది..

ఫిబ్రవరి 19న ఓ బాలికను కొందరు యువకులు ఎవరూ లేని.. ప్రదేశానికి రమ్మని చెప్పారు. అక్కడకు వెళ్లిన ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేశారు. ఇదే సమయంలో వారి వద్ద ఉన్న ఫోన్​లతో వీడియోలు తీశారు. అనంతరం ఆ బాలికను గువహటిలోని ఓ హోటల్​ రూమ్​కు తీసుకెళ్లి మరోసారి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికి అయినా చెప్తే ఈ వీడియోలను నెట్టింట వైరల్​ చేస్తామాని బెదిరించారు. అనంతరం ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు మార్చి 8 వ తేదీన ఆల్​ ఉమన్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను బికీ అలీ, ఫైజల్​ అలీ, పింకూ అలీ, పోనా అలీ, రాజా అలీగా గుర్తించారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

పైశాచికం.. వీధి కుక్కపై యాసిడ్​ పోసిన పోకిరీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.