గుజరాత్ కచ్ జిల్లాలో విషాదం నెలకొంది. నర్మదా కాలువలో పడి ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. స్థానికులు మృతదేహాలను కాలువ నుంచి వెలికితీశారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వీరంతా వ్యవసాయ కూలీలని చెప్పారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సోమవారం రాత్రి 7 గంటలకు జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: మరణించిన వ్యక్తిని సర్పంచ్‌గా గెలిపించిన గ్రామస్థులు.. మళ్లీ ఆయనకే ఓటేస్తామంటూ..
'రాష్ట్రపతి ఓ స్వీట్ లేడీ'.. బంగాల్ మంత్రి వ్యాఖ్యలకు దీదీ క్షమాపణ