Five People of Same Family Dies by Suicide : రాజస్థాన్ బీకానేర్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను హనుమాన్ సోనీ(45), భార్య విమల (40), మోహిత్(18), రిషి(16), గుడియా(14)గా గుర్తించారు.
ఇదీ జరిగింది
ముక్తాప్రసాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంత్యోదయ నగర్‌కు చెందిన హనుమాన్ సోనీ భార్య, పిల్లలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి యజమాని వచ్చి గేటు తీయలేదు. దీంతో అతడు వెళ్లిపోయి మరుసటి రోజు వచ్చేసరికి గేటు తీయకపోవడం వల్ల అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో నుంచి దుర్వాసన వచ్చింది. వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరచి చూడగా విగతజీవులుగా కనిపించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరణానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. వీరంతా రెండు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండడం వల్ల మృతదేహం నుంచి వాసన రావడానికి సమయం పట్టిందని పోలీసులు అంటున్నారు.
మరదలితో వివాహేతర సంబంధం-సోదరుడి ప్రైవేట్ భాగాలు కట్
మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సొంత సోదరుడినే హత్య చేశాడో వ్యక్తి. అతడి ప్రైవేట్ భాగాలను బ్లేడుతో కోసి హత్య చేశాడు. ఈ ఘటన అసోంలోని బజలీ జిల్లాలోని కట్లా పథర్‌లో జరిగింది.
బజాలి జిల్లాకు చెందిన ప్రంజల్ రాయ్, ధనంజిత్ రాయ్ సోదరులు. కొన్నేళ్ల క్రితం ప్రంజల్ రాయ్‌కు వివాహం జరిగింది. తన మరదలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడంటూ బుధవారం గొడవ పెట్టుకున్నాడు ప్రంజల్. ఈ క్రమంలోనే వివాదం పెరిగి సోదరుడు ధనంజిత్ రాయ్ ప్రైవేట్ భాగాలను బ్లేడుతో కోసేశాడు. పరిస్థితి విషమించడం వల్ల ధనంజిత్ మరణించాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నువ్వు చస్తే మొదటి పెళ్లాం దగ్గరికెళ్తా - కళ్లెదుటే భార్య ఉరేసుకుంటుంటే వీడియో తీసిన భర్త
పదో తరగతి విద్యార్థినిని సజీవదహనం చేసిన దుండగులు- అదే కారణమా?