కేరళలోని ఇడుక్కి జిల్లాలో చిరుతను వేటాడి.. వండుకుని తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు చిరుత చర్మం, గోర్లు అమ్మకానికి పెట్టగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇడుక్కి శివారు గ్రామానికి చెందిన వినోద్ తన పొలంలోకి అటవీ జంతువులు రాకుండా ఉచ్చులు ఏర్పాటు చేశాడని పోలీసులు భావించారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తన పొలంలో ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నాడని వెల్లడించారు. ఇంతకముందు కూడా అనేక జంతువులను చంపినట్టు గుర్తించారు.
50కేజీలు..
ప్రస్తుత ఘటనలో సుమారు 50కేజీల బరువున్న చిరుత చిక్కగా.. వినోద్ అతని స్నేహితులు కలసి దాన్ని వండుకొని తిన్నారని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అనంతరం నిందితులు చిరుత చర్మం, పళ్లు, గోర్లను అమ్మకానికి పెట్టారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు.. మంకుళం అటవీ అధికారి ఉదయసూర్యన్ తెలపారు.
ఇదీ చదవండి: ఈ ఎద్దుకు మామూలు అభిమానులు లేరుగా..