ETV Bharat / bharat

ఒకే కుటుంబంలో ఐదుగురు దారుణ హత్య - కుటుంబ సభ్యుల హత్య

ఆస్తి తగాదా కారణంగా.. ఒకే ఇంట్లో ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లోని అయోధ్య జిల్లాలో జరిగింది.

murder
హత్య
author img

By

Published : May 23, 2021, 9:13 AM IST

ఉత్తర్​ప్రదేశ్ అయోధ్య జిల్లా​లో దారుణం జరిగింది. ఆస్తి విషయంలో తగాదా చెలరేగి ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మల్కిపుర్​ తాలుకాలోని బారియా నిశారు గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఏం జరిగింది?

బారియా నిశారు గ్రామంలో రమేష్​ కుమార్(35)​ అనే వ్యక్తి తన మేనల్లుడితో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. అయితే.. మామా అల్లుడి మధ్య చాలా రోజులుగా ఓ భూమి విషయంలో తగాదాలు ఉన్నాయి. శనివారం రాత్రి రమేష్​ కుమార్​, అతడి భార్య జ్యోతి సహా వారి ​ కుమార్తె, ఇద్దరు కుమారులను రమేశ్​కుమార్​ మేనల్లుడు గొంతుకోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పారు.

ఈ హత్యల సమాచారం అందుకుని.. జిల్లా మేజిస్ట్రేట్​ అనూజ్​ కుమార్​ ఝా, ఎస్​ఎస్​పీ శైలేశ్​ పాండే, ఎస్పీ శైలేంద్ర సింగ్​ ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు బృందాలు గాలిస్తున్నాయని ఎస్​ఎస్​పీ శైలేష్​ కుమార్​ పాండే తెలిపారు.

ఇదీ చూడండి: 66కు పెరిగిన మృతులు.. గజ ఈతగాళ్లతో గాలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.