ETV Bharat / bharat

బర్త్​డే పార్టీకి వెళ్లొస్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం - ACCIDENT FAMILY

బంధువుల ఇంట్లో బర్త్​డే పార్టీకి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెందారు. మరో ఘటనలో కారు డివైడర్​ను ఢీకొనగా.. ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

Five members of a family, including four women, were killed

author img

By

Published : Jul 24, 2022, 11:08 AM IST

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ట్రక్కును ఢీకొట్టగా.. ఒకే కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు మహిళలే.
కుకనూర్​ తాలూకా బిన్యాల్ గ్రామానికి చెందిన దేవప్ప కొప్పడ్​(62) తన కుటుంబంతో కలిసి.. కొప్పల్​లోని తమ బంధువుల ఇంట్లో బర్త్​డే పార్టీకి హాజరయ్యారు. శనివారం రాత్రి ఇంటికి తిరిగివస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు కుకనూర్​లోని భానుపుర్​​ వద్ద ట్రక్కును ఢీకొట్టింది. రాత్రి 10.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

Five members of a family, including four women, were killed
ట్రక్కును ఢీకొట్టిన కారు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులు మృతి.. ఆదివారం ఉదయం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా సమీపంలో జరిగింది. పోలీసు సిబ్బంది కర్ణాటక బెంగళూరులోని శివాజీనగర్​ పోలీస్​ స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు ఆ రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర.
డ్రగ్స్​ విక్రయించే ఓ వ్యాపారి చిత్తూరులో ఉన్నాడన్న సమాచారంతో.. అతడిని పట్టుకునేందుకు వెళ్తుండగా కారు డివైడర్​ను ఢీకొట్టింది. మృతదేహాలను, క్షతగాత్రులను బెంగళూరుకు తరలించారు.

ఇవీ చూడండి: 'మా పని మనిషితోనే స్టెరాయిడ్స్​ ఇప్పించారు.. బాలీవుడ్ మాఫియా వేధిస్తోంది'

జనాభా నియంత్రణపై బిల్లు.. నటుడు రవికిషన్​పై నెటిజన్లు ఫైర్​.. నలుగురు పిల్లలున్నారంటూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.