ETV Bharat / bharat

కాలువలో పడి ఐదుగురు బాలికలు మృతి.. మట్టి కోసం వెళ్లగా ప్రమాదం - డంపర్​ ఢీకొట్టిన వ్యాన్

మట్టిని తెచ్చేందుకు కాలువ దగ్గరికి వెళ్లిన ఐదుగురు బాలికలు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, డంపర్​ను మినీ వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం యూపీలోని హమీర్​పుర్​లో జరిగింది.

Five girls drown
నీటిలో మునిగిపోయిన బాలికలు
author img

By

Published : Oct 22, 2022, 8:40 PM IST

ఉత్తర్​ప్రదేశ్ సుల్తాన్​పుర్​లో ఘోరం జరిగింది. మట్టిని తెచ్చేందుకు కాలువ దగ్గరకు వెళ్లిన ఐదుగురు బాలికలు.. నీటిలో మునిగి మృతి చెందారు. పేమపుర్ కజూరి​ గ్రామంలో శనివారం జరిగిందీ దుర్ఘటన. విషయం తెలుసుకున్న స్థానికులు.. ఘటనా స్థలానికి చేరుకుని నలుగురు బాలికల మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మరో బాలిక కోసం గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఐదుగురు బాలికలు మట్టిని తెచ్చేందుకు కాలువ దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో కాలువలో పడి ఐదుగురు బాలికలు మరణించారు. మృతులతో వెళ్లిన మరికొందరు బాలికలు గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని బాలికల మృతదేహాలను వెలికితీశారు. ఘటనా స్థలికి చేరుకునన్న పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు సీఎం యోగి.

డంపర్​ను ఢీకొట్టిన వ్యాన్​..
ఉత్తర్​ప్రదేశ్​ హమీర్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన డంపర్.. ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యానులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. కబ్రాయ్ సాగర్ రోడ్డులోని మౌదాహ కూడలిలో శనివారం జరిగిందీ ఘటన. మృతులను లఖన్‌లాల్ (35), పవన్ (29), రాహుల్ (19)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత డంపర్ డ్రైవర్ పరారయ్యాడని తెలిపారు. డంపర్​ను సీజ్ చేసి.. నిందితుడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: పోలీస్ స్టేషన్​లో వందేమాతరం పాడుతూ మార్చ్​ఫాస్ట్ చేసిన తాగుబోతు​

దీపావళికి కనులవిందుగా ముస్తాబైన దేవాలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.